Breaking News

13 ఏళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్న నటుడు, త్వరలో షూటింగ్‌ పూర్తి

Published on Fri, 01/06/2023 - 13:26

గ్రామీణ కథా చిత్రాలతో 1980లో వరుస విజయాలను అందుకున్న నటుడు రామరాజన్‌. మక్కళ్‌ నాయకన్‌గా ప్రజల మన్ననలను అందుకున్న ఈయన నటించిన అత్యధిక చిత్రాలకు ఇళయరాజానే సంగీతాన్ని అందించారు అనేది గమనార్హం. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటూ వచ్చిన ఈయన 13 ఏళ్ల తర్వాత తాజాగా సామాన్యన్‌ అనే చిత్రంతో కథానాయకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు.

దీన్ని తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వి మదియళగన్‌ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు తంబికోట్టై, మరైంది రుందు పార్కుమ్‌ మర్మం ఎన్నా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్‌. రాఖేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. నటుడు రాధారవి, దర్శకుడు కేఎస్‌ రవికుమార్, ఎంఎస్‌ భాస్కర్, శరవణన్‌ సుబ్బయ్య లియో శివ, నక్ష చరణ్, స్మతి వెంకట్, అపర్ణలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. సామాన్యన్‌ చిత్ర కథానాయకుడు రామరాజన్, దర్శక,నిర్మాతలు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సంగీత దర్శకుడు ఇళయరాజాను ఆయన రికార్డింగ్‌ థియేటర్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని, షూటింగ్‌ తర్వాతే సంగీతాన్ని అందించడానికి మీ వద్దకు వస్తామని చెప్పడంతో ఇళయరాజా ఆశ్చర్యపోయినట్లు నిర్మాత తెలిపారు. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)