Breaking News

జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే: రజినీకాంత్

Published on Sun, 07/30/2023 - 18:02

Rajnikanth Speech Latest: సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు చెప్పగానే ఆవేశంతో ఊగిపోయే ఫ్యాన్స్, విజిల్స్‌తో దద్దరిల్లే థియేటర్లు గుర్తొస్తాయి. అయితే 'రోబో' తర్వాత ఈయన రేంజ్‌కు తగ్గ మూవీస్ పడలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు 'జైలర్' కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 10న రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన తలైవా.. తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో పశ్చాత్తాప పడ్డారు.

నేను చేసిన పెద్ద తప్పు
'నా జీవితంలో మద్యం అనేది లేకపోయింటే ఈ పాటికి నేను సమాజసేవ చేస్తుండేవాడిని. మందు తాగడం.. జీవితంలో నేను చేసిన అతిపెద‍్ద తప్పు. 'నువ్వు రాజువి మందు తాగొద్దు' అని నా తమ్ముడు అప్పటికీ చెబుతుండేవాడు. కానీ నేనే వినలేదు. ఒకవేళ నా లైఫ్‌లో ఆ‍ల్కహాల్ అనేది లేకపోయింటే.. ఇప్పుడున్న దానికంటే ఎంతో గొప్పస్థాయిలో ఉండేవాడిని, వ్యక్తిగతంగా కూడా'

(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)

మీ వల్ల వాళ్లకు ఇబ్బంది
'అయితే నేను పూర్తిగా మందు తాగొద్దు అని చెప్పడం లేదు. మీకు సరదాగా అనిపించినప్పుడు ఎప్పుడో ఓసారి తాగండి. కానీ రోజూ మాత్రం డ్రింక్ చేయొద్దు. ఎందుకంటే అది మీ ఆరోగ్యంతోపాటు మీ చుట్టూ వాళ్ల ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఒకవేళ మీరు తాగితే మాత్రం మొత‍్తం జీవితం తలకిందులైపోతుంది. మీ తల్లిదండ్రులు, కుటుంబం, అందరూ మీ తాగుడు వల్ల ఇబ్బంది పడతారు. అందుకే మందు తాగొద్దు' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.

మరి రజినీకాంత్ ఇంతలా చెప్పారు కానీ ఫ్యాన్స్ దీన్ని పాటిస్తారా అనేది సందేహమే. సరే ఇదంతా పక్కనబెడితే 'జైలర్' తెలుగులో పెద్దగా బజ్ లేదు. 'కావాలయ్యా' అనే పాట యూట్యూబ్, ఇన్ స్టాలో ట్రెండింగ్ లో ఉంది కానీ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందనేది చూడాలి. తమిళ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి సూపర్‌స్టార్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆగస్టు 10 వరకు ఆగాలి. 

(ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?)

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)