Breaking News

నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు మృతి

Published on Fri, 03/27/2026 - 12:06

టాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు రాహుల్ రామకృష్ణ  సోదరుడు మరణించారు. పారాక్వాట్ (Paraquat) అనే రసాయన గడ్డిమందు కారణంగా తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని  సోషల్ మీడియా ద్వారా అయన తెలిపారు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా సులభంగా అందుబాటులో ఉండటం తెలిసి తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఈ రసాయనం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్యను చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు.  

ఆత్మహత్యల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేయబడుతోందని ఆవేదన చెందారు. ఇది ప్రతిచోటా ఎంత సులభంగా లభిస్తుందో చూసి దిగ్భ్రాంతి చెందానని ఆయన అన్నారు. దయచేసి వీలైనంత త్వరగా దీనిని నిషేధించండి - ప్రాణాలను కాపాడండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), భారత ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) ఆయన విజ్ఞప్తి చేశారు.

భారతదేశంలో పారాక్వాట్ వినియోగం ఇప్పటికీ కొనసాగుతుంది.  దీని విషపూరితత కారణంగా కొన్ని రాష్ట్రాలు (ఉదా: తెలంగాణ) అమ్మకాలపై పరిమితులు విధించాయి. ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని పూర్తిగా నిషేధించాయి. వైద్య నిపుణులు చిన్న పరిమాణం కూడా ప్రాణాంతకమని హెచ్చరించడంతో తెలంగాణ ప్రభుత్వం (2026) పారాక్వాట్ అమ్మకాలపై పరిమితులు విధించింది.  భారతదేశంలో చాలా రాష్ట్రాలు కొన్ని కఠిన మార్గదర్శకాలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు ఎక్కువగా ఈ రసాయనం వల్ల ప్రభావితమవుతున్నారు.
 

Videos

టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు

కరీంనగర్ RBL బ్యాంక్ లో భారీ కుంభకోణం

అమెరికా సంచలన నిర్ణయం కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం

2 నెలల దాకా నో టెన్షన్.. దేశంలో 8 లక్షల టన్నుల LPG నిల్వలు

కడపలో ఆధిపత్య పోరు టీడీపీ ఇంఛార్జ్ ఆవుల వెంకటేష్ పై దాడి

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు

రణరంగంగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఖమేనీ హత్యను ఖండిస్తూ విపక్షాల నిరసన

తాడిపత్రి బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు

వైద్య విద్య అందించలేని తండ్రీకొడుకులు బాబు,లోకేష్ పై AISF నేతలు ఫైర్

Photos

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)