మహిళపై అత్యాచారం.. ఎస్సై శ్రీకాంత్ పై కేసు నమోదు
Breaking News
శ్రీ రాముడిపై ప్రకాష్ రాజ్ వివాదస్పద వ్యాఖ్యలు
Published on Fri, 04/17/2026 - 09:05
శ్రీరాముడు హిందూ ధర్మంలో అత్యంత పూజనీయమైన దేవుడిగా ఆరాధిస్తారు. రాముడు నిత్యజీవితంలో మమేకమై ఉంటాడని నమ్ముతారు. శ్రీరామ అని లేకుండా శుభలేఖ లేదు. రాముడి వీరత్వంలో తిరుగులేదు. ఎంతో కీర్తి ఉన్న రాముడు, లక్ష్మణులను వలస కూలీలు అని సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొనడం సిగ్గుచేటని నెటిజన్లు భగ్గుమంటున్నారు. గతంలో తన వివాదాస్పద వ్యాఖ్యలతో అనేక చిక్కుల్లో పడిన ఆయన ఇప్పుడు మరోసారి హిందూ మనోభావాలను దెబ్బతీసేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు.
కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వ్యంగ్యంగా చెబుతూ.. రాముడు, లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలని, వారిద్దరూ దక్షిణ భారత్‌కు చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారని పేర్కొన్నాడు. అయితే, దానిని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని అడిగినట్లు ఎద్దేవా చేశాడు. ఈ కారణం వల్లనే వివాదం మొదలైందని ఎటకారంగా కామెంట్ చేశాడు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాంప్రదాయ ఇతిహాస కథనాన్ని వక్రీకరించినందుకు నెటిజన్లు కూడా విరుచుకుపడుతున్నారు. మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
బీజేపీ కార్యవిధానాన్ని తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఈ దేశంలో ప్లాన్ ప్రకారం ఒక జాతి నిర్మూలనకు అడగులు పడుతున్నాయి. వారు ముస్లింలను తుడిచిపెట్టాలనుకుంటున్నారు. ఆపై గిరిజనులను, మైనారిటీలను తుడిచిపెట్టాలనుకుంటున్నారు." అని ఆయన అన్నాడు. కానీ, మత సామరస్యం, ప్రజల విశ్వాసం అనే అంశాన్ని తీసుకుని ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఎలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న నెటిజన్లు అనేక పోస్టులు పెడుతున్నారు. రాబోయే ప్రాజెక్టులలో ఆయనకు అవకాశం ఇవ్వడంపై చిత్రనిర్మాతలు పునరాలోచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా వంటి వారు వారణాసి, స్పిరిట్, దృశ్యం 3 చిత్రాల నుంచి ఆయన్ను తొలగొంచాలని కోరుతున్నారు.
Prakash Raj claims Ram was a North Indian, Ravan a South Indian tribal, and their conflict began because Ram "STOLE FRUITS."🥲
This is what happens when you learn itihas from church pic.twitter.com/yRJmEzwivq— The Jaipur Dialogues (@JaipurDialogues) April 16, 2026
Tags : 1