6సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్‌.. కొడుకు పేరు జహంగీర్‌!

Published on Thu, 02/19/2026 - 18:38

ఛత్రపతి శివాజీ.. ఈ పేరు వినగానే తెలియని ధైర్యం ఒంట్లోకి వస్తుంది. తన మతాన్ని, సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన ధీరశాలి. నేడు (ఫిబ్రవరి 19న) శివాజీ మహారాజ్‌ జయంతి. ఈ సందర్భంగా వెండితెరపై ఆరుసార్లు శివాజీగా వేషం వేసి మెప్పించిన నటుడెవరో చూసేద్దాం..

ఆరు సార్లు శివాజీగా..
ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత చిన్మయ్‌ మాండ్లేకర్‌.. ఒకటీ రెండుసార్లు కాదు, ఏకంగా ఆరుసార్లు వెండితెరపై శివాజీ పాత్రను పోషించాడు. ఫర్జంద్‌, ఫత్తేశికస్త్‌, పవన్‌కైండ్‌, షేర్‌ శివరాజ్‌, సుబేదార్‌, శివరాయంచ అనే ఆరు మరాఠి సినిమాల్లో శివాజీగా వేషం కట్టాడు. కానీ ఒకే ఒక్క సంఘటన వల్ల ఇకపై ఎన్నటికీ శివాజీగా కనిపించనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

అసలేం జరిగిందంటే?
మరాఠి నటుడు చిన్మయ్‌ మాండ్లేకర్‌.. శివాజీ పాత్రలో నటించినందుకుగానూ ప్రత్యేక గుర్తింపు, ఆదరణ పొందాడు. కానీ ఆయన కుమారుడికి జహంగీర్‌ అనే పేరు పెట్టాడు. ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి తనపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. కుటుంబం మొత్తానిపై విమర్శలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన చిన్మయ్‌.. ఈ ట్రోలింగ్‌ అన్యాయం అంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. 

సంచలన నిర్ణయం
వృత్తిపరంగా విమర్శలు చేస్తే ఓకే కానీ, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్‌ చేయడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశాడు. తన కొడుకు, భార్య క్యారెక్టర్‌పై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారని, ఇది తప్పని అభిప్రాయపడ్డాడు. శివాజీ మహారాజ్‌ అంటే తనకు ఎంతో గౌరవం అని, ఇకపై ఆయన పాత్రను వెండితెరపై చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

కుమారుడికి ఆ పేరు ఎందుకంటే?
మరి కుమారుడికి జహంగీర్‌ పేరు ఎందుకు పెట్టాడంటే? జహంగీర్‌ జంషెడ్‌ నవ్రోజ్‌లో జన్మించాడు. భారతరత్న జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా స్ఫూర్తితో కుమారుడికి జహంగీర్‌ అని పేరు పెట్టాడు. ఇక చిన్మయ్‌ మాండ్లేకర్‌.. హిందీలో తేరే బిన్‌ లాడెన్‌, సమీర్‌, ద కశ్మీర్‌ ఫైల్స్‌, గాంధీ గాడ్సే: ఏక్‌ యుధ్‌ సినిమాల్లో నటించాడు. కాలాపాణి, దల్దల్‌ వంటి వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేశాడు.

చదవండి: ఓటీటీలో థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌... రిలీజ్‌ ఎప్పుడంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)