Breaking News

ఏషియన్‌ గ్రూప్స్‌తో మరో స్టార్‌ హీరో మల్టీఫ్లెక్స్‌ ప్లాన్‌

Published on Sun, 06/16/2024 - 13:00

టాలీవుడ్ హీరో నితిన్ వరుస సినిమాలతో కొద్దిరోజుల్లో సందడి చేయనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే ఆయన పెరిగారు. అందుకే తన సోదరి నిఖితతో కలిసి శ్రేష్ఠ మూవీస్‌ బ్యానర్‌ను స్థాపించి పలు సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా నితిన్‌ మరో అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్‌లో మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ను స్థాపిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ఆయన ఫ్యాన్‌ పేజీ నుంచి ఒక ఫోటో విడుదలైంది.

మ‌హేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌వితేజ వంటి స్టార్స్‌ ఇప్పటికే ఏషియన్‌ సినిమాస్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని మల్టీఫ్లెక్స్‌లు నిర్మించారు. త్వరలో బెంగళూరులో AMB ప్రారంభం కానుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో రవితేజ ART కూడా త్వరలో ప్రారంభం కానుంది. అయితే, హీరో నితిన్‌ కూడా సంగారెడ్డి ప్రాంతంలో ఏషియన్‌ నితిన్‌ సితార పేరుతో ఒక మల్టీఫ్లెక్స్‌ నిర్మిస్తున్నారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆయనకు సంబంధించిన ఫ్యాన్‌ పేజీలలో ఈ వార్త బాగా ట్రెండ్‌ అవుతుంది. ఇప్పటికే థియేటర్‌ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఓపెనింగ్‌ కానున్నట్లు సమాచారం.

నితిన్‌ సినిమాల విషయానికి వస్తే.. తమ్ముడు త్వరలో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కాంతార ఫేం సప్తమి గౌడ నటిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ లయ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'రాబిన్‌హుడ్‌' చిత్రంలో కూడా నితిన్‌ నటిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)