Breaking News

కాలు విరగ్గొట్టుకున్న నవదీప్.. ఆ నటి మాత్రం!

Published on Thu, 07/06/2023 - 14:29

టాలీవుడ్ ప్రముఖ నటుడు నవదీప్ కాలు విరిగింది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. నటి తేజస్విని ఓ వీడియో షేర్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అయితే నవదీప్ కి గాయమైందని ఆమె బాధపడటం సంగతి అటుంచితే.. అతడిని తెగ ఏడిపించింది. ఈ వీడియోలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. దీంతో అసలు ఏం జరిగిందా అని అందరూ అనుకుంటున్నారు.

'జై' సినిమాతో హీరోగా పరిచయమైన నవదీప్.. ఆ తర్వాత లీడ్ రోల్ లో పలు సినిమాలు చేశాడు గానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆర్య 2, బాద్ షా తదితర చిత్రాల్లో ప్రతినాయక లక్షణాలున్న పాత్రల్లో కనిపించాడు. కొన్నాళ్ల ముందు పలు షోల్లో జడ్జిగా, పార్టిసిపెంట్ గానూ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు)

ఏమైందో ఏమో గానీ ఈ మధ్య నవదీప్ కాలికి గాయమైంది. దీంతో అతడిని పరామర్శించడానికి వచ్చిన నటి తేజస్విని.. ఆటపట్టిస్తూ ఓ రీల్ చేసింది. దాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన పలువురు నటీనటులు.. నవదీప్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఫన్నీగా ఉందని నవ్వుకుంటున్నారు. 

దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'ఐస్ క్రీమ్' సినిమాలో నవదీప్-తేజస్విని తొలిసారి కలిసి నటించారు. ఆ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన వీళ్లిద్దరూ.. సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటారు. గతంలో ఓసారి తేజు కాలికి గాయమైనప్పుడు నవదీప్ ఇలానే ఆటపట్టించాడు. ఇప్పుడు దానికే తేజూ రివేంజ్ తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. నవదీప్ రీసెంట్‌గా 'న్యూసెన్స్' సిరీస్ లో, తేజస్విని 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ లో నటించారు.


(ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?)

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)