Breaking News

ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు విరాళం

Published on Wed, 12/17/2025 - 11:57

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో హీరో నాగార్జున సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు.  కాలేజీ కోసం రూ.2 కోట్లని విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద  కళాశాల విద్యార్థులకు రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌ని నాగార్జున ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. నాన్నగారు స్థాపించిన ఏ సంస్థ అయిన నాకు ఎంతో ప్రత్యేకం. గుడివాడ రావడం భావోద్వేగంగా ఉంది. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగానూ ఉంది. మనుషులు శాశ్వతం కాదు వారు చేసే పనులే శాశ్వతం. తాను చదువుకో లేకపోయినా వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం నాగేశ్వరరావు కళాశాల స్థాపించారు.

రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు చదువు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సినిమాకు రూ. 5 వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో లక్ష రూపాయలని కళాశాలకు విరాళంగా ఇచ్చారు. ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున ప్రతియేటా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తాను. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అని నాగార్జున చెప్పుకొచ్చారు.

అ‍క్కినేని నాగేశ్వరరావు విషయానికొస్తే.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు 255కు పైగా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 'ధర్మపత్ని' (1941)తో ప్రారంభించి 'సీతారామ జననం' (1944)లో తొలి హీరోగా మారి, 'దేవదాసు' (1953)తో స్టార్‌డమ్ అందుకున్నారు, పౌరాణిక, జానపద, సామాజిక పాత్రలతో పాటు 'నవరాత్రి'లో తొమ్మిది పాత్రలు పోషించారు, 'అన్నపూర్ణ స్టూడియోస్' స్థాపించి, 'మనం' (2014) చిత్రంలో చివరగా నటించారు. తెలుగు సినిమాను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.

ఏఎన్నార్ తర్వాత నాగార్జున హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం నాగ్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది 'కుబేర', 'కూలీ' చిత్రాల్లో నాగ్ వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)