Breaking News

హిట్‌ సినిమాల్లో నటించిన మోహ‌న్‌రాజ్ కన్నుమూత

Published on Fri, 10/04/2024 - 11:08

సౌత్‌ ఇండియా ప్రముఖ నటుడు మోహ‌న్‌రాజ్ అనారోగ్యంతో క‌న్నుమూశాడు. ‘కిరిక్కాడాన్‌ జోస్‌’గా మలయాళంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.  1989లో ‘కిరీదామ్‌’ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది.  తెలుగులో ఎక్కువ‌గా బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు, వెంక‌టేష్‌ల‌తో సినిమాలు చేశాడు. ఈ క్రమంలో లారీ డ్రైవ‌ర్‌, స‌మ‌ర‌సింహారెడ్డి, అసెంబ్లీరౌడీ,నరసింహ నాయుడు,సోగ్గాడి పెళ్ళాం,బొబ్బిలి సింహం,అసెంబ్లీ రౌడీ,శివమణి వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించారు. సుమారు 300కు పైగా సినిమాల్లో మోహన్‌రాజ్‌ మెప్పించారు.

గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్‌రాజ్‌ తిరువనంతపురంలో  చికిత్స తీసుకుంటుండగా వెంటిలేటర్‌పైనే ఆయన మరణించారు. ఈ విషయాన్ని మలయాళ నటుడు, దర్శకుడు, పి.దినేశ్‌ పనికర్‌ తెలిపారు.  మోహన్‌రాజ్‌కు భార్య ఉషతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 21 మూవీస్.. అవి ఏంటంటే?

పార్కిన్సన్స్‌తో (పక్షవాతం) బాధపడుతున్న మోహన్‌రాజ్‌కు కొద్దిరోజుల క్రితం గుండె పోటు కూడా రావడంతో వెంటనే ఆయన్ను చెన్నైలోని ఓ  ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తిరువనంతపురంలోని మరో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా ఆయన మరణించారు. తెలుగులో మోహన్‌బాబు  ‘శివశంకర్‌’ (2004) అనే చిత్రంలో ఆయన చివరిగా కనిపించారు. ఇందులో  హీరోగా నటించారు. మోహన్‌రాజ్‌ మృతిపట్ల మలయాళ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)