Breaking News

చిన్నారి ఆపరేషన్‌ కోసం సాయం చేసిన ప్రముఖ హీరో

Published on Sun, 11/26/2023 - 08:45

కోలీవుడ్‌లో జివి ప్రకాష్ కుమార్  తమిళ చిత్రసీమలో మల్టీటాలెంటెడ్‌గా గుర్తింపు పొందాడు. ఎ.ఆర్.రహమాన్ మేనళ్లుడిగా ఆయన ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత చిత్రసీమలో తనదైన ముద్ర వేశాడు.  చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తన 25 ఏళ్లకే 25 చిత్రాలకు మ్యూజిక్ అందించి రికార్డు సాధించాడు. ఆ తర్వాత 'డార్లింగ్‌' మూవీతో హీరోగా సత్తా చాటి సింగర్‌, యాక్టర్‌,నిర్మాతగా కోలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు.     ప్రస్తుతం  ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', విక్రమ్ 'తంగళన్' సహా పలు చిత్రాలకు మ్యూజిక్‌ అందించాడు.

సినిమాలతో పాటు   ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను జివి ప్రకాష్ కుమార్ షేర్‌ చేస్తాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై గొంతు విప్పి, సహాయం కోరిన వారికి చేతనైనంత సాయం చేస్తుంటాడు. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి తన సోదరి బిడ్డను ఎవరైనా కాపాడాలంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.  బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఏడాది బిడ్డ ఇబ్బంది పడుతుందని తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో సహాయం కోరుతూ.. ఇలా పోస్ట్ చేశాడు.

'ఆన్‌లైన్‌లో ఇలా ఆర్థిక సహాయం అడగడానికి ఇ‍బ్బందిగా ఉందని అయినా ఆ బిడ్డ ప్రాణాల కోసం ఎలాగైనా అడుగుతాను. నా సోదరి అబ్బాయి (1 సంవత్సరం) మెదడు వైపు కణితి ఉందని వైద్యులు చెప్పారు. ఇది కొంచెం భయంగా ఉంది. మధురై అపోలో ఆసుపత్రికి బాబును తీసుకెళ్తే అక్కడ వెంటనే ఆపరేషన్ అవసరం అన్నారు. రూ. 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు. మా కుటుంబం నుంచి 2 లక్షల వరకు సిద్ధం చేశాను. మీరు నాకు కొంత సాయం చేసినా..  నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.  మీకు తోచినంత చేయండి మిత్రులారా.' అని ఆ యువకుడు తెలిపాడు.

సినీనటుడు జివి ప్రకాష్ కుమార్ ఆ పోస్ట్‌కు రియాక్ట్‌ అయ్యాడు. ఆ చిన్నారి ఆపరేషన్‌ కోసం తన వంతుగా రూ.75 వేలు పంపారు. దీన్ని తన ఎక్స్ సైట్‌లో పోస్ట్ చేసి ' నా నుంచి ఇది చిరు సాయం' అని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో జివి ప్రకాష్ చర్యను పలువురు అభినందిస్తున్నారు. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్‌కు మరికొందరు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)