హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు

Published on Sat, 09/14/2024 - 13:11

అభిమానం వెర్రితలలు వేయడం అనే మాట వినే ఉంటారు. ప్రముఖ హీరోహీరోయిన్లపై ఇష్టంతో కొందరు ఫ్యాన్స్ వింత వింత పనులన్నీ చేస్తుంటారు. ఇలానే ఓ అమ్మాయి ఎవరూ ఊహించని పనిచేసింది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా ఇంట్లో ఏకంగా పనిమనిషిగా చేరిపోయింది. తాజాగా ఈ విషయాన్ని సదరు నటుడి భార్య బయటపెట్టింది.

అప్పట్లో హిందీలో తనదైన డ్యాన్సులతో గోవిందా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇతడి భార్య సునీత రీసెంట్‌గా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ.. అప్పట్లో గోవిందా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేదోనని ఓ సంఘటన చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి ఎదురుదెబ్బ)

'ఆయనకు చాలామంది అభిమానులున్నారు. కానీ అప్పట్లో జరిగిన సంఘటనని అంత సులువుగా మర్చిపోలేను. మాకు పెళ్లయిన కొత్తలో ఓ అమ్మాయి మా ఇంటికి వచ‍్చింది. ఇంటి పనుల్లో సాయం చేస్తానని పనిమనిషిగా చేరింది. 20 రోజులు మాతోనే ఉంది. ఆమెకు ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం అస్సలు రాదు. షూటింగ్ నుంచి ఆలస్యంగా వచ్చే మా ఆయన కోసం నిద్ర మానుకుని మరీ ఎదురుచూసేది. ఎందుకో అనుమానమొచ్చి ఆమెని కాస్త గట్టిగా అడగ్గా అసలు సంగతి బయటపెట్టింది. నా భర్తకు వీరాభిమాని అని చెప్పింది. దీంతో ఆమె ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాం. ఆమె తండ్రి నాలుగు ఖరీదైన కార్లలో మా ఇంటికి వచ్చారు. ఆయన మంత్రి అని తెలిసి షాకయ్యాం' అని చెప్పారు.

ఇక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గోవిందా.. కెరీర్ పీక్ దశలో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు. 2009 వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు.

(ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్‌)

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)