Breaking News

ఒక్కరోజు వ్యవధిలో కన్నుమూసిన అక్కాచెల్లెళ్లు

Published on Fri, 03/08/2024 - 13:15

గర్భాశయ క్యాన్సర్‌ వల్ల నటి పూనమ్‌ పాండే మరణించిందంటూ ఆమె టీం ఇటీవల ఓ ప్రాంక్‌ చేసింది. దానివల్ల ఎంతటి వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే! గర్భాశయ క్యాన్సర్‌ గురించి అవగాహన కల్పించేందుకే బతికుండగానే చనిపోయినట్లు నాటకం ఆడింది పూనమ్‌. తన ఉద్దేశం బాగానే ఉన్నా, అవగాహన కల్పించాల్సిన తీరు బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్‌ అంత ప్రమాదమా? దాని వల్ల మరణిస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది. 

క్యాన్సర్‌తో ఒకరు..
ఈ క్రమంలో తాజాగా బుల్లితెర నటి డాలీ సోహి (48) ఇదే క్యాన్సర్‌ బారినపడి కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో శుక్రవారం(మార్చి 8న) ఉదయం తుదిశ్వాస విడిచింది. మరింత విషాదం ఏంటంటే.. నటి కన్నుమూయడానికి ముందు రోజు ఆమె సోదరి అమందీప్‌ సోహి కూడా ప్రాణాలు విడిచింది.

జాండిస్‌తో సోదరి మృతి
పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్‌) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్‌ సే హి, ఖూబ్‌ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్‌ ద్వారా ఆమె ఆడియన్స్‌కు దగ్గరైంది.

చదవండి:'గామి' మూవీ రివ్యూ

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)