Breaking News

నటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ నటుడు దిలీప్ నిర్దోషిగా తీర్పు

Published on Mon, 12/08/2025 - 11:34

మలయాళ సూపర్‌ స్టార్‌ దిలీప్‌ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా కోర్టు తీర్పు ఇచ్చింది. 2017లో జరిగిన నటి అపహరణ, దాడి కేసులో కేరళ కోర్టు ఈరోజు ఉదయం 11 గంటలకు తీర్పు వెలువరించింది. 2017లో జరిగిన నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ, ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మొదటి ఆరుగురు నిందితులతో పాటు పల్సర్ సునిని ప్రధాన దోషులుగా తేల్చారు. దిలీప్‌పై 120 బి అభియోగాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి తెలిపారు.

2017 కేరళ నటి దాడి కేసు
మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు పొందిన ప్రముఖ నటిని కిడ్నాప్‌ చేసి, వేధింపులకు గురి చేసిన కేసులో దిలీప్‌ ఎనిమిదో నిందితుడిగా ఉన్నాడు. 2017, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రిపూట ఓ హీరోయిన్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లి, కారులోనే రెండు గంటలపాటు వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆపై ఆ వేధింపుల పర్వాన్ని ఫోన్‌లలో రికార్డు చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడాలని చూశారు. ఈ కేసులో దిలీప్‌తో పాటు పది మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)