ధనుష్‌ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..?

Published on Thu, 07/24/2025 - 07:43

ఎవరైనా, ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకున్నారంటే దాని వెనుక వారి శ్రమ, కృషి, అంకితభావం ఉంటుంది. అలా సినీ రంగంలో నిరంతర శ్రమ, పట్టుదలతో శ్రమించి సాధించిన వారు ఎందరో ఉన్నారు. అయితే, అలాంటి వారు తమ రంగంలో సాధించిన తరువాత అక్కడితో ఆగకుండా, ఇతర రంగాలతో పాటు రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఆవిధంగా సాధించిన వారూ ఉన్నారు. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, జయలలిత వంటి వారు సినిమా రంగంలో అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని ,రాజకీయరంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రులుగానూ ప్రజాదరణ పొందారు. ఆ తరువాత కమలహాసన్‌, విజయకాంత్‌ వంటి వారు రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజల్లో ఉన్నారు. ఇక రజనీకాంత్‌ ఆ ప్రయత్నం చేసినా, ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

ఇప్పుడు విజయ్‌ రాజకీయాల్లో రాణించడానికి రంగంలోకి దిగారు. ధనుష్‌ కూడా అదే దారిలో అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌, విజయ్‌ వంటి నటుల బాటలో ధనుష్‌ పయనించనున్నారు. అవును తన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి ఉత్సాహపరచడానికి ఆయన సిద్ధమయ్యారు. అందుకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా గత వారమే ధనుష్‌ తన అభిమానులను కలుసుకోవలసి ఉంది. అందుకు స్థానిక సాలిగ్రామంలో ఒక స్టూడియోను కూడా 25 వారాల పాటు వారానికి ఒక్క రోజు(ఆదివారాల్లో మాత్రమే ) అభిమానులను కలుసుకునే విధంగా బుక్‌ చేసినట్లు తెలిసింది. 

నిజానికి గత వారమే ధనుష్‌ అభిమానులను కలుసుకోవలసి ఉందనీ, అయితే ఆయన కాలికి దెబ్బ తగలడం వల్ల ఆ వారం వాయిదా పడిందని సమాచారం. కాగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్రతివారం 500 మంది అభిమానులను కలిసి మాట్లాడనున్నట్లు తెలిసింది. ఇలా అభిమానులను కలవాలన్న ధనుష్‌ సంచలన నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే చర్చ కోలీవుడ్‌ వర్గాల్లో జరుగుతోంది. గతంలో రజనీకాంత్‌, విజయ్‌, కమల్‌ హాసన్‌ వంటి వారు మొదట అభిమానులతో ఫోటో కార్యక్రమం పెట్టి వారితో మరింత దగ్గరయ్యాకనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)