Breaking News

డేనియ‌ల్ బాలాజీ మంచి మనసు.. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు

Published on Sat, 03/30/2024 - 09:26

కోలీవుడ్ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ (48) క‌న్నుమూశాడు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్థ‌రాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన డేనియ‌ల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి కుటుంబ సభ్యులు త‌ర‌లించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్‌ బాలాజీ మరణించినట్లు  అక్కడి వైద్యులు తెలిపారు.

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’.. శరీరంలోని అన్ని అవయవాల కంటే కళ్లు ప్రధానమైనవని దానర్థం. ఈ క్రమంలోనే అమరుల నుంచి కళ్లు సేకరించి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ క్రమంలో డేనియల్‌ బాలాజీ కూడా తన నేత్రాలను దానం చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. మరణం తర్వాత తన కళ్లు మరో ఇద్దరికి చూపును ఇవ్వాలని తలచాడు. అందుకు సంబంధించిన ఐ రిజిస్టర్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈమేరకు కుటుంబ సభ్యుల అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు.

ఇప్పుడు ఆయన మరణం తర్వాత డేనియల్‌ బాలాజీ నేత్రాలను అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి వారు భద్రపరిచి మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు తోడ్పడుతున్నారు. డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేయడంతో అందుకు సంబంధించిన ఆపరేషన్‌ పూర్తి అయిందని తన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తన స్వగృహానికి తరలించనున్నారు. తిరువాన్మియూర్‌లోని ఆయన నివాసంలో రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతో మందిని బతికేలా చేస్తున్న మంచి హృదయం ఉన్న డేనియల్ బాలాజీ అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు.

👉: గుండెపోటుతో నటుడి హఠాన్మరణం.. డేనియల్‌ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)