Breaking News

మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?

Published on Wed, 07/26/2023 - 07:07

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య 'భోళా శంకర్' పూర్తి చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలు అలరిస్తుండగా, జూలై 27న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రీసెంట్‌గా షూటింగ్ పూర్తయిన తర్వాత చిరు.. తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. అయితే అది విహారయాత్ర అనుకున్నారు. కానీ మెడికల్ పనిమీద వెళ్లినట్లు సమాచారం.

చిన్న సర్జరీ
'భోళా శంకర్' సినిమాను చిరు పూర్తి చేసినప్పటికీ.. గత కొన్నాళ్ల నుంచి ఆయన కాలి నొప్పితో బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే అమెరికా టూర్ ప్లాన్ చేశారు. రిలీఫ్‌తో పాటు చిన్నపాటి సర్జరీ పూర్తి చేసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలుత సీక్రెట్‌గా ఉంచినప‍్పటికీ ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఆ విషయం బయటకొచ‍్చేసింది.

(ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!)

నో కంగారు
అసలు సమస్య ఏంటి? సర్జరీ ఏం జరిగింది? లాంటి విషయాలు ప్రస్తుతం ఏం తెలియదు. కానీ ప్రాబ్లమ్ మాత్రం ఏమంత పెద్దది కాదని, కంగారు పడాల్సిన అవసరం లేదని చిరు సన్నిహితులు చెబుతున్నారు. అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన ఆయన..  ఎయిర్‌పోర్ట్‌లో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లారు. కాబట్టి కంగారు పడాల్సిందేం లేదని సన్నిహితులు అంటున్నారు. 

నెక్స్ట్ ఆ సినిమా
'భోళా శంకర్'.. ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. కాబట్టి త్వరలో చిరు ప్రమోషన్లకు హాజరవుతారు. అలానే కూతురు సుస్మిత నిర్మాణంలో కొత్త సినిమా కూడా మొదలుపెడతారు. ఇందులో మెగాస్టార్‌తో పాటు త్రిష, సిద్ధు, శ్రీలీల నటిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇది మలయాళ సినిమా 'బ్రో డాడీ'కి రీమేక్ అని అంటున్నారు. క్లారిటీ రావాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)