Breaking News

సహజంగా కనిపించే అవకాశం దక్కింది: బ్రహ్మాజీ

Published on Fri, 02/21/2025 - 06:25

‘‘బాపు’ చాలా యునిక్‌ కాన్సెప్ట్‌. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంటుంది. అప్పుల బాధతో నా పాత్ర ఆత్మహత్యకి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? అనేది ఈ సినిమాలో చూడాలి. ఈ చిత్రం ఫైనల్‌ కాపీ చూశాను... చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’ అని బ్రహ్మాజీ అన్నారు. దయా దర్శకత్వంలో బ్రహ్మాజీ, ఆమని, ‘బలగం’ సుధాకర్‌ రెడ్డి, ధన్యా బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాపు’.

రాజు, సీహెచ్‌ భానుప్రసాద్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ  మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం దయా ‘బాపు’ కథ చెప్పారు. పాయింట్‌ చాలా కొత్తగా, నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో పాటు సహజంగా కనిపించే అవకాశం ఉండటంతో ఒప్పుకున్నాను. అయితే బడ్జెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు.. నాకు పారితోషికం వద్దు... విడుదల తర్వాత లాభాలు వస్తే ఇవ్వమని నిర్మాతలకు చెప్పాను. నా తర్వాత ఇతర నటీనటులు కూడా పారితోషికం తగ్గించడం, లొకేషన్‌లో క్యారవ్యాన్స్‌ వాడకుండా చిత్రీకరణ జరిపిన ఊర్లో (కరీంనగర్‌) ఉంటూ సర్దుకుపోవడంతో ఈ మూవీ పూర్తి చేశాం.

కథపై ఇష్టం, సినిమాపై నమ్మకంతోనే ఇది సాధ్యపడింది. ఆమనిగారు సహజ నటి. ‘బాపు’ టైటిల్‌ రోల్‌లో సుధాకర్‌ రెడ్డిగారి పాత్రతో ఆడియన్స్‌ చాలా కనెక్ట్‌ అవుతారు. ఈ సినిమాలోని రెండు పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటిగారికి మా సినిమా చాలా నచ్చింది. ఇక ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలో విజయ్‌ సేతుపతిగారు చేసినటువంటి పాత్ర చేయాలన్నది నా కల. ప్రస్తుతం చిరంజీవిగారి ‘విశ్వంభర’లో ఓ పాత్ర చేశాను. సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్‌’తో పాటు తరుణ్‌ భాస్కర్, రాజ్‌ తరుణ్‌ వంటి వారి సినిమాల్లో నటిస్తున్నాను’’ అని తెలిపారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)