Breaking News

ఏంజెలీనా జోలితో విడాకులు.. తొలిసారి బ్రాడ్ పిట్ వ్యాఖ్యలు

Published on Thu, 05/29/2025 - 09:29

ప్రముఖ హాలీవుడ్‌ నటులు ఏంజెలీనా జోలి - బ్రాడ్ పిట్ గతేడాదిలోనే విడాకులు తీసుకున్నారు. సుమారు 8 ఏళ్ల పాటు కోర్టులో కొనసాగిన  తర్వాత ఎట్టకేలకు అధికారికంగా వారు విడిపోయారు.  హాలీవుడ్ చరిత్రలో సుదీర్ఘమైన, అత్యంత వివాదాస్పదమైన విడాకులలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే, తొలిసారి బ్రాడ్‌ పిట్‌ ఈ విడాకుల గురించి GQ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

సుదీర్ఘ విడాకుల పోరాటంలో ఏంజెలీనా జోలితో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత మీకు ఉపశమనం కలిగిందా అని అడిగినప్పుడు, బ్రాడ్ పిట్ ఇలా అన్నాడు.. 'లేదు.., అది అంత పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను.  పరిష్కారం అనేది చట్టపరమైన లాంఛన ప్రాయం మాత్రమే, ఉపశమనం కాదు. 8 ఏళ్ల తర్వాత ఒక ఒప్పందంతోనే ఆమె నుంచి విడిపోయాను. ఎవరినైనా అడిగి నా గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. నేను ఎంతో క్షోభ అనుభవించాను. జీవితంలో చికాకు చెందాను. వివిధ స్థాయిలలో  నా శక్తికి మించే పోరాడాను.  ఇప్పుడు వాటి గురించి మాట్లాడి సమయాన్ని వృధా చేసుకోవాలనిలేదు. నా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఇది 30 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది' అన్నారు.

అదే ఇంటర్వ్యూలో ప్రస్తుతం తాను ఎలా ఉన్నాడో చెప్పాడు. ' నేను చాలా అందంగానే ఉన్నాను కదా. జీవితం బాగానే కొనసాగుతుంది.  నా స్నేహితులతో పాటు నా కుటుంబంతో గడుపుతున్నాను.  నేను ఎవరో నాకు ఇప్పుడే తెలిసింది. కెరీర్‌ పరంగా కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ స్పీడ్‌ పెరిగింది. తను నటించిన కొత్త సినిమా  'F1 - ది మూవీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది జూన్ 27న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో థియేటర్లలోకి వస్తుంది.

హాలీవుడ్ నటులు, అస్కార్ విజేతలైన ఏంజెలీనా జోలి(49), బ్రాడ్ పిట్(61) కొన్నేళ్ల పాటు డేటింగ్‌ చేసి ఆ తర్వాత పెళ్లి (2014) చేసుకున్నారు. ఈ జంటకు ఆరుగురు పిల్లలు. అయితే,  2016లో వారు ఒక ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు బ్రాడ్ పిట్ తమ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారని జోలీ విడాకుల కోరింది.  2019లో ఈ దంపతులకు విడాకులు ముంజూరయ్యాయి. కానీ, ఆస్తుల విభజన విషయంలో చాలా కాలం పాటు కోర్టులో విచారణ జరిగింది. 2024లో పూర్తిగా వారు విడిపోయారు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)