Breaking News

నాలుగు పెళ్లిళ్లు కాదు.. నాది రెండోపెళ్లి మాత్రమే.. నటుడు యూటర్న్‌

Published on Sun, 12/01/2024 - 18:21

నాకు నాలుగు పెళ్లిళ్లయ్యాని అందరూ ఈర్ష్యపడుతున్నారు.. పెళ్లి కాని ప్రసాదులైతే నాపై ఎంతో ఏడుస్తున్నారు అని మలయాళ నటుడు బాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ అంతలోనే యూటర్న్‌ తీసుకున్నాడు. తనకు రెండు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయంటున్నాడు.

అది నా మొదటి పెళ్లి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల మాట్లాడుతూ.. నాకు 21 ఏళ్ల వయసులో చందనతో వివాహం జరిగింది. ఆమె నా స్కూల్‌మేట్‌. ఇద్దరం ప్రేమించుకున్నాం, గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. కానీ నా దృష్టిలో అది నిజమైన పెళ్లి కాదు. ఎందుకంటే తను మరో వ్యక్తితో వెళ్లిపోకూడదనుకుని ఆవేశంలో అలా చేశాను. మా కుటుంబాలు మమ్మల్నిద్దరినీ విడదీయడంతో కలిసుండలేకపోయాం.

కోకిల నా రెండో భార్య
కానీ తనతో నాకు ఇప్పటికీ పరిచయం ఉంది. మా మధ్య స్నేహం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో తన భర్తతో సంతోషంగా ఉంది. ఇకపోతే నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నానని జనాలు నమ్మడం ఆశ్చర్యం​గా ఉంది. చట్టపరంగా కోకిల నా రెండో భార్య. డాక్టర్‌ ఎలిజబెత్‌ ఉదయన్‌ను మూడో పెళ్లి చేసుకున్నట్లు రూమర్స్‌ ఉన్నాయి. 

అది లీగల్‌ మ్యారేజ్‌ కాదు
నిజానికి అది చట్టపరమైన వివాహం కాదు. ఇంతకుమించి తనగురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. అయితే ఓ విషయం. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంది, చాలా సాయం చేసింది. అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞత తెలుపుకుంటాను. ఆమె ఎంతో అద్భుతమైన వ్యక్తి. తనకెప్పుడూ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

బాలా- అమృత విడాకులు
సింగర్‌ అమృతా సురేశ్‌తో జరిగిన వివాహం గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. ఇకపోతే బాలాకు, అమృతకు 2010లో పెళ్లి జరగ్గా వీరికి అవంతిక అనే కూతురు ఉంది. 2019లో వీరు విడాకులు తీసుకున్నారు. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమృత.. బాలాపై కేసు కూడా పెట్టింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)