Breaking News

60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్‌

Published on Thu, 05/25/2023 - 17:14

విలన్‌ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్‌ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘కాల్ సంధ్య’సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు.

ముఖ్యంగా తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్‌ చిత్రాలతో పాపులర్‌ అయ్యారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్‌ అవార్డు సంపాదించుకున్న ఆశీష్‌ విద్యార్థి ఇప్పటివరకు 11 భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు.

అయితే తాజాగా రెండోపెళ్లితో ఆశీష్‌ విద్యార్థి వార్తల్లో నిలిచారు. 60ఏళ్ల వయసులో అస్సాంకు చెందిన రూపాలి బారువాను పెళ్లాడారు. ఈమె ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈమెకు కోల్‌కతాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి. కొంత కాలంగా ఆశిష్ విద్యార్ధి.. రూపాలి బారువాతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటినే నిజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు. గతంలో ఆశీష్‌ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా సుపరిచితం. వీరికి అర్త్‌ విద్యార్థి అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థ కారణంగా ఆశీష్‌ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. ఇప్పుడు ఈయన 60 ఏళ్ల వయసులో రూపాలిని మనువాడాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)