Breaking News

ఈ హీరోను గుర్తుపట్టారా? అప్పుడలా.. ఇప్పుడిలా..!

Published on Mon, 03/18/2024 - 13:08

శరీరాన్ని నచ్చినట్లు మలచడం అంత ఈజీ కాదు. కానీ సినిమాతారలు మాత్రం ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో కనిపిస్తారు. సిక్స్‌ ప్యాక్‌, ఎయిట్‌ ప్యాక్‌.. అవసరమైతే ఫ్యామిలీ ప్యాక్‌లో కూడా దర్శనమిస్తారు. మళ్లీ యాక్షన్‌ మూవీ అనగానే వెంటనే కొవ్వును కరిగించేసుకుని.. కండలు తిరిగిన దేహం కోసం శ్రమిస్తారు. పైన కనిపిస్తున్న హీరో కూడా అదే చేశాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? రాజా రాణి, వరుడు, సైజ్‌ జీరో, సైంధవ్‌ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫేమ్‌ సంపాదించుకున్న ఆర్య.

ఏడాదిగా కసరత్తులు
తమిళంలో హీరోగా రాణిస్తున్న ఆర్య గతేడాది మిస్టర్‌ ఎక్స్‌ అనే సినిమా ఒప్పుకున్నాడు. లావుగా, కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫోటో అప్పటిదే! సినిమాకు సంతకం చేసిన మరుసటి నెల నుంచే కసరత్తులు చేయడం ప్రారంభించాడు. కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నాడు. 'గతేడాది మార్చిలో సినిమా ఒప్పుకున్నాను. ఏప్రిల్‌లో వర్కవుట్స్‌ స్టార్ట్‌ చేశా.. సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఇప్పుడు లాస్ట్‌ షెడ్యూల్‌ జరుగుతోంది. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. 2023 ఏప్రిల్‌లో.. 2024 మార్చిలో నా లుక్‌ ఇలా ఉంది' అంటూ ఫోటోలు షేర్‌ చేశాడు.

మైండ్‌ బ్లోయింగ్‌
ఇది చూసిన ఫ్యాన్స్‌ మైండ్‌ బ్లోయింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మిస్టర్‌ ఎక్స్‌ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో మంజు వారియర్‌, శరత్‌ కుమార్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్‌ కార్తీక్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

చదవండి: 56 ఏళ్ల వయసులో నటుడి డేటింగ్‌.. విడిపోయామంటూ పోస్ట్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)