అతనెవరో నాకు తెలియదు.. అనసూయ అదిరిపోయే కౌంటర్‌

Published on Thu, 01/08/2026 - 15:17

నటడు శివాజీ ఒక వేదికపై మాట్లాడుతూ హీరోయిన్ల దుస్తుల గురించి కామెంట్‌ చేశారు. అవి సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయనకు కౌంటర్‌గా యాంకర్‌, నటి అనసూయ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎవరూ చెప్పాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఏమీ చిన్నపిల్లలం కాదని తెలిపారు. తమ పరిధితో పాటు హక్కులు కూడా తెలుసన్నారు. 'మా ఇష్టానికి మమ్మల్ని బతకనీయండి.' అంటూ శివాజీ పేరు ఎత్తకుండానే కౌంటర్‌ ఇచ్చారు. దీంతో ఆమెపై నెట్టింటి భారీ ట్రోలింగ్‌ జరిగింది. బూతులతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆమె ఎక్కడా తగ్గలేదు. తిరిగి అదే రేంజ్‌లో సమాధానం చెప్పారు.

కొద్దిరోజులుగా అనసూయ అభిమాన సంఘం పేరుతో కొందరు మీడియా వేదికగా డిబెట్‌లలో పాల్గొంటున్నారు.  ఈ అంశంపై ఆమె వివరణ  ఇచ్చారు. తాజాగా తన అభిమానులతో మాట్లాడేందుకు ఆమై లైవ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అనసూయ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడినంటూ చెప్పుకునే వ్యక్తిపై కామెంట్‌ చేశారు. ఫ్యాన్స్‌ అనే పదం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నా పేరుతో కొన్ని సోషల్‌మీడియా పేజీలు, సంఘాలు ఉన్నా.. వారు నన్ను కలిసినప్పుడు మంచిగానే మాట్లాడుతాను. నిజాయితీగా ఉన్నవారితో టచ్‌లో కూడా ఉంటాను. 

నాపై కొందరు చాలా కష్టపడి రీల్స్‌ చేస్తారు.. వాటిని నేను షేర్‌ చేస్తూ ఉంటాను.  ఇప్పుడు నాపేరు చెప్పుకుని తెరపైకి వచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతని మాటలను నేను ఏకీభవించను. అతను ఎలా వచ్చారో నాకు తెలియదు. ఈ చర్చలో పాల్గొన్న వారు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్లు ఎప్పుడూ కూడా నన్ను కలవలేదు.  నా పేరు ఉపయోగించుకుని వారు బతుకుతున్నారు.' అంటూ  అనసూయ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడినంటూ డిబేట్స్‌లలో పాల్గొంటున్న వ్యక్తిపై ఆమె కామెంట్‌ చేశారు.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)