Breaking News

నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్

Published on Fri, 12/27/2024 - 10:40

సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు నటుడు అల్లు అర్జున్ ఆన్‌లైన్‌ ద్వారా హాజరుకానున్నారు. పుష్ప2 ప్రీమియర్స్‌ సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు  అల్లు అర్జున్‌ కారణం అంటూ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో  నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆ సమయంలో బన్నీని చంచల్‌గూడ జైలుకు కూడా తరలించారు. అయితే, అదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

అయితే, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్ నేటితో పూర్తి అవుతుంది. రిమాండ్‌ గడువు పూర్తి అయిన తర్వాత జరిగే ప్రాసెస్‌లో భాగంగా అల్లు అర్జున్‌ వర్చువల్‌గా కోర్టులో హాజరుకానున్నారు. ఆపై ఆయన తరపు లాయర్లు    నాంపల్లి కోర్టుకు హాజరై అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలపనున్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని గతంలోనే అల్లు అర్జున్‌ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. దీంతో వారు నాంపల్లి కోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసే అవకాశం ఉంది.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి రూ.2కోట్ల సాయం పుష్ప2 టీమ్‌ అందించింది. అల్లు అర్జున్‌ తరపున రూ. కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు అందించిన విషయం తెలిసిందే. రేవతి కుమారుడు శ్రేతేజ్‌ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని ఇప్పటికే వైద్యులు కూడా ప్రకటించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)