అమ్మాయి ‘నో’ చెప్పిందని.. నా మేనల్లుడు చనిపోయాడు: అలీ ఎమోషనల్‌

Published on Wed, 07/09/2025 - 15:24

కమెడియన్‌ అలీ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా సరదాగా ఉంటాడు. మూవీ ఈవెంట్స్‌లో అందరిపై పంచులు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. కానీ నిన్న జరిగిన ఓ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో 15 ఏళ్ల క్రితం తన ఫ్యామిలీలో జరిగిన ఓ విషాదకర విషయాన్ని చెప్పి అందరిని ఎమోషనల్‌కు గురి చేశాడు.

సుహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న  నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై  హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడానికి తాను ఎందుకు ఒప్పుకున్నాడో వివరించాడు.

ఈ సినిమా దర్శకుడు రామ్‌ నా దగ్గరకు వచ్చి ‘సుహాస్‌కి మేనమామ క్యారెక్టర్‌ చేయాలి’ అన్నారు. వెంటనే నేను ఓకే చెప్పాను. ఎంత ఇస్తారని(రెమ్యునరేషన్‌) అడగలేదు..ఎన్ని రోజులు కావాలని అడిగాను. వెంటనే ఎందుకు ఒప్పుకున్నానంటే.. సుహాస్‌కి మామయ్య క్యారెక్టర్‌ చేయాలి అన్నారు. ఎంత ఇస్తారు అని అడగలేదు. ఎన్నిరోజులు కావాలని అడిగా. ఎందుకు చేస్తాననిచెప్పానంటే... 15 ఏళ్ల క్రితం నా మేనల్లుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మా అక్క చనిపోతే.. అతన్ని మా అమ్మే పెంచింది. నా ముందే ఎదిగాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె మాత్రం నో చెప్పింది. 

ఆ మనస్థాపంతో నా మేనల్లుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అప్పటి నుంచి రెండేళ్ల పాటు ఆ అమ్మ ప్రతి రోజు ఏడ్చింది. మనవడు అయినా..కొడుకులా పెంచింది. ఈ సినిమా స్టోరీ చెప్పగానే నాకు మేనల్లుడు గుర్తొచ్చాడు. సుహాన్‌లో  చనిపోయిన నా మేనల్లుడుని చూసుకున్నాను. అందుకే ఈ పాత్రకి నేను బాగా కనెక్ట్‌ అయ్యాను’ అని అలీ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత మళ్లీ తనదైన శైలీలో పంచులేసి..అందర్నీ నవ్వించాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)