Breaking News

పదేళ్ల తర్వాత నా లైఫ్‌ మారబోతుంది : అఖిల్‌

Published on Wed, 11/19/2025 - 13:21

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్లుగా ఉంటున్న నాకు సరైన బ్రేక్‌ రాలేదు. ఆ కష్టానికి తగిన ఫలితం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి నా జీవితం మారిపోతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్‌ అవుతుంది’’ అని హీరో అఖిల్‌ రాజ్‌(Akhil Raj) చెప్పారు. 

సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్‌ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.

తేజస్విని మాట్లాడుతూ– ‘‘రాంబాయి క్యారెక్టర్‌కు నేను సరిపోతానని ఎంపిక చేశారు. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు సాయిలుగారు సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు నేను భావోద్వేగానికి గురయ్యా.ఈ చిత్రాన్ని 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్ వంటి కల్ట్ మూవీస్ తో పోల్చుకోవచ్చు. 

ఆ చిత్రాల్లాగే మా సినిమా కూడా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది. ఈ నెల 21న మా మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుంది’ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)