సహించేది లేదు... క్షమించేది లేదు: అఖిల్‌

Published on Sat, 10/05/2024 - 02:47

నాగచైతన్య–సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యల్ని సినీ ప్రముఖులు ముక్తకంఠంతో ఖండించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పడంతోపాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కాగా కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్‌ మరోసారి స్పందించి, సోషల్‌ మీడియాలో ఘాటుగాపోస్టు పెట్టారు.

 దాని సారాంశం ఏంటంటే... ‘‘కొండా సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు అసభ్యకరంగా, జుగు΄్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోయి ప్రవర్తించిన తీరు సిగ్గు చేటు, క్షమించరానిది. ఆమె మాటలతో మా కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు కూడా బాధపడ్డారు. 

స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో.. తన కంటే చాలా ఉన్నత విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేశారామె. కుటుంబ సభ్యుడిగా, చిత్ర పరిశ్రమ సభ్యుడిగా మౌనంగా చూస్తూ ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఆమెను సహించేది లేదు... క్షమించేది లేదు’’ అని పేర్కొన్నారు అఖిల్‌.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)