Breaking News

హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్‌

Published on Sat, 04/19/2025 - 13:13

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith Kumar) కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియం కారు రేసింగ్‌లో  అజిత్‌ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అజిత్‌ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కారు రేసింగ్‌లో అజిత్‌ పలుమార్లు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల మార్చిలో స్పెయిన్‌లో జరిగిన రేసింగ్‌లో కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ రేసింగ్‌లో.. మరో కారును తప్పించే క్రమంలో అజిత్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన కారు ట్రాక్‌ తప్పి పల్టీలు కొట్టింది. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్‌ అవడంతో అజిత్‌ సురక్షితంగా బయటకు వచ్చాడు.

సినిమా
అజిత్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన లేటెస్ట్‌ మూవీ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (Good Bad Ugly Movie) బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొమ్మిది రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి అజిత్‌ కెరీర్‌లోనే టాప్‌ మూవీగా రికార్డు సృష్టించింది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ప్రియ ప్రకాశ్‌ వారియర్‌, సునీల్‌, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలు పోషించారు.

 

 

చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్‌

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)