Breaking News

రెమ్యునరేషన్‌ విషయంలో అజిత్‌ సరికొత్త ఢీల్‌

Published on Fri, 08/01/2025 - 09:13

నటుడు అజిత్‌ ఇటీవల నటించిన విడాముయర్చి చిత్రం మినహా అన్నీ విజయం సాధించాయి. తాజాగా అజిత్‌ కథానాయకుడిగా నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం కారు రేస్‌పై దృష్టి సారిస్తున్న అజిత్‌ త్వరలో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకుముందు అజిత్‌ హీరోగా గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా తాజాగా ఈ హిట్‌ కాంబినేషన్‌ రూపొందనున్న ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్‌ సంస్థ అధినేత రాహుల్‌ నిర్మించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

 కాగా ఈ చిత్రానికి అజిత్‌ పారితోషికమే తీసుకోకుండా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అలాగని ఫ్రీగా నటించడం లేదు.. అజిత్, నిర్మాత రాహుల్‌ ఒక డీల్‌ చేసుకున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ డీల్‌ ఏమిటంటే చిత్రం విడుదలైన తరువాత ఓటీటీ, డిజిటల్‌ హక్కులను అజిత్‌కు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అజిత్‌ ఇప్పటివరకు ఒక్కో చిత్రానికి రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. కాగా ఇంతకుముందు వరకు కొంత పారితోషికంతో పాటు ఒకటి రెండు ఏరియాల హక్కులను కోరే హీరోలు ఇకపై అజిత్‌లా ఓటీటీ, డిజిటల్‌ హక్కులు కోరతారేమో.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)