Breaking News

‘రావణాసుర’లో రవితేజను చూసి షాకవుతారు: అభిషేక్‌ నామా

Published on Wed, 04/05/2023 - 15:37

‘ధ్రిల్లర్‌ జోనర్స్‌ లో షాకింగ్‌, వావ్‌ ఫ్యాక్టర్స్‌ ఉంటాయి. అవి ముందే ఆడియన్స్‌కి తెలిస్తే.. ఆ కిక్కు రాదు. ‘రావణాసుర’ థ్రిల్లర్‌ మూవీ. అందుకే ఆ సినిమా కథ గురించి బయటకు చెప్పడం లేదు. థియేటర్స్‌లో రవితేజ నటనను చూసి షాకవుతారు’ అని నిర్మాత  అభిషేక్ నామా అన్నారు. రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా అభిషేక్‌ నామా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

► ఇంతవరకూ రవితేజ ‘రావణాసుర’లాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ఇలా కూడా చేయగలుగుతారా ? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ . ఇది వర్కౌట్‌ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు. 

►రావణాసుర కథ నచ్చి, దానిపై నమ్మకంతోనే డబ్బుపెట్టాం. నమ్మకం ఉన్నపుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ? మేము నమ్మిన సినిమా మేమే విడుదల చేస్తున్నాం. 

►అనుకున్న బడ్జెట్ లోనే ఈ సినిమా పూర్తి చేశాం. సుధీర్ వర్మ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. అనుకున్న  సమయంలో అనుకున్న బడ్జెట్ కి పూర్తి చేశారు. 

►ఈ చిత్రంలో రవితేజను చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయి షాక్ లో ఉంటారు. రవితేజ గారిని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయింది కదా అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ అదిరిపోతుంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ విడుదలైన తర్వాత ఇదే సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ప్లాన్ చేయాలనే ఆలోచన ఉంది.

►సుధీర్‌ వర్మతో ‘కేశవ’ సినిమా చేశాను. అది  కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. అయితే బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది. రావణాసురతో బ్లాక్ బస్టర్ వంద శాతం కొడతాం. 

►మ్యూజిక్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్ రామేశ్వర్ కుటుంబం అంతా సంగీతకారులు. తనకి చాలా ప్రతిభ ఉంది. మొదట ‘సాక్ష్యం’ సినిమా ఇచ్చాను. తర్వాత రవితేజ గారికి చెప్పాను. రావణాసురతో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు. 

►ప్రస్తుతం నేను నిర్మిస్తున్న  డెవిల్‌ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. రెండు మూడు నెలల్లో ఏదైనా మంచి డేట్ చూసి విడుదల చేస్తాం. డెవిల్ 2 కూడా ఉంది. 2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)