Breaking News

ఆ విషయంలో ఐశ్వర్యకి థ్యాంక్స్‌: అభిషేక్‌ బచ్చన్

Published on Tue, 11/26/2024 - 00:20

‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేస్తున్నానంటే అది నిజంగానే నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలను నా భార్య ఐశ్వర్యా రాయ్‌ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. ఆ విషయంలో తనకు థ్యాంక్స్‌ చెబుతున్నాను’’ అని హీరో అభిషేక్‌ బచ్చన్  అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ–‘‘కుటుంబం విషయంలో ఐశ్వర్య ఎంతగానో సపోర్ట్‌ చేస్తుంది. ఆమె వల్లే నేను సినిమాలపై పూర్తీగా దృష్టి పెడుతున్నాను. ఈ రోజుల్లో పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు.

నేను పుట్టిన తర్వాత మా అమ్మ జయా బచ్చన్  సినిమాలు మానేశారు. భర్త, పిల్లలు, కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలతో బిజీగా ఉండి రాత్రి ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే.. నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ నా స్కూల్‌లో జరిగే ప్రతి ఫంక్షన్ కు, నా బాస్కెట్‌ బాల్‌ cటీలకు నాన్న వచ్చేవారు. తల్లిదండ్రులుగా మనం పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలి. అలాగే వారి నుంచి ప్రేరణ ΄పొందాలి. ప్రపంచంలోని తల్లిదండ్రులపై నాకు అమితమైన గౌరవం ఉంది.

తల్లి బాధ్యతలు మరెవరూ చేయలేరు. తండ్రికి కూడా ఎంతో ప్రేమ, బాధ్యతలు ఉంటాయి. కానీ వాటిని పైకి చూపించడు. వయసు పెరిగేకొద్దీ పిల్లలకు తండ్రి ప్రేమ అర్థమవుతుంది’’ అని చె΄్పారు అభిషేక్‌. కాగా అభిషేక్‌ బచ్చన్ , ఐశ్వర్యా రాయ్‌ 2007లో వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ మాటలతో ఆ వార్తలకు చెక్‌ పడిందని బాలీవుడ్‌ టాక్‌. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య