Breaking News

ఓటీటీ సినిమా.. కూతురి కల కోసం తండ్రి చేసిన పోరాటమే 'బి హ్యాపీ'

Published on Thu, 02/27/2025 - 08:13

బాలీవుడ్‌ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన 'బి హ్యాపీ' డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్‌ తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రం చాలామంది హృదయాన్ని కదిలించేలా ఉంటుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. రెమో డిసౌజా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై లిజెల్ రెమో డిసౌజా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో అభిషేక్ బచ్చన్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, నోరా ఫతేహి, ఇనాయత్ వర్మ  ప్రధాన పాత్రల్లో నటించారు. నాసర్, జానీ లివర్ మరియు హర్లీన్ సేథి సహాయక పాత్రల్లో నటించారు.

'బి హ్యాపీ' చిత్రాన్ని మార్చి 14న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుందని అభిషేక్‌ బచ్చన్‌ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ తండ్రి, కూతురు మధ్య ఉన్న అమితమైన ప్రేమను చూపుతుంది.  ఒంటరి గా ఉన్న తండ్రి శివ్ ( అభిషేక్ బచ్చన్ ) అతని చురుకైన కుమార్తె ధారా (ఇనాయత్ వర్మ) మధ్య విడదీయరాని బంధానికి ప్రేక్షకులు ఫిదా అవుతారని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో వేదికపై డ్యాన్స్‌ చేయాలనే ఆశతో ఉన్న కూతురి కలను ఒక తండ్రి ఎలా నెరవేర్చాలనుకుంటాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్‌.  కానీ, ఊహించని సంక్షోభం వల్ల వారిద్దరికి ఎదురయ్యే కష్టాలు ఏంటి..? తన కూతురి ఆశయాన్ని నిజం చేసేందుకు ఆ తండ్రి ఏం చేశాడు..? విధిని కూడా సవాల్‌ చేసిన ఒక తండ్రి కథే 'బి హ్యాపీ' చిత్రం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మార్చి 14న విడుదల కానుంది.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)