Breaking News

సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్‌.. 24 గంటల్లోనే కోర్టుకు!

Published on Wed, 09/10/2025 - 19:07

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌(Abhishek Bachchan) గురించి ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు. ఒకట్రెండు చిత్రాల్లో కనిపించినా అవీ కూడా ఓటీటీల్లోనే నేరుగా రిలీజయ్యాయి. ఏడాది హౌస్ఫుల్‌ -5, కాళీధర్ లపత్తా లాంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవలే అభిషేక్ సతీమణి ఐశ్వర్య రాయ్తన అనుమతి లేకుండా ఫోటోలు, పేరును వినియోగించకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్న వాటిని తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండానే అనేక వెబ్‌సైట్‌లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. ఏఐ- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య ప్రస్తావించారు.

అదే బాటలో అభిషేక్ బచ్చన్..

అయితే తన భార్య పిటిషన్వేసిన 24 గంటల్లోనే అభిషేక్ బచ్చన్ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పబ్లిసిటీ, వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. కొన్ని వెబ్‌సైట్‌లు తన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోర్టును కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానెల్స్ అనధికారికంగా ఫోటోలను ఉపయోగించడంపై నిషేధం విధించాలని ఆయన అభ్యర్థించారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దయచేసి వెబ్సైట్ల వివరాలు సమర్పిస్తే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని అభిషేక్ తరఫు న్యాయవాదికి సూచించారు. ఒక రోజు సమయం ఇస్తే పూర్తి వివరాలు అందజేస్తామని న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. కొందరు వ్యక్తులు ఏఐతో అభిషేక్‌ ఫొటోలు క్రియేట్‌ చేసి అశ్లీల కంటెంట్‌కు ఉపయోగించుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు