Breaking News

నువ్వు కూతుర్ని చూసుకో, ఐశ్వర్యను సినిమాలు చేయనివ్వు..

Published on Sun, 04/30/2023 - 09:36

ఐశ్వర్యరాయ్‌ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే! అప్పటికి, ఇప్పటికి ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్‌ సెల్వన్‌ 2 సినిమాలోనూ తన అందంతో, హావభావాలతో అదరగొట్టింది. హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా అద్భుతంగా ఉందని సోషల్‌ మీడియాలో రివ్యూ ఇచ్చాడు ఐశ్వర్య భర్త, హీరో అభిషేక్‌ బచ్చన్‌. చిత్రయూనిట్‌ కృషి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని కొనియాడాడు. ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్్‌ స్పందిస్తూ.. 'ఇప్పటికైనా తెలిసిందిగా! నువ్వు ఆరాధ్యను చూసుకో, తనను మరిన్ని సినిమాలు చేయనివ్వు' అని కామెంట్‌ చేశాడు. దీనికి అభిషేక్‌ స్పందిస్తూ.. 'నేనేమైనా వద్దన్నానా? సర్‌, తను ఏది చేయాలనుకున్నా అందుకు నా అనుమతి అవసరం లేదు. అందులోనూ తనకు నచ్చిన పనులు చేయాలనుకుంటే నేనెందుకు వద్దంటాను' అని రిప్లై ఇచ్చాడు. అతడి సమాధానం విని సంతోషం వ్యక్తం చేసిన ఫ్యాన్స్‌.. 'చాలా బాగా చెప్పారు సర్‌, అలాగే మీరిద్దరు కూడా కలిసి సినిమా చేస్తే చూడాలని ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా అభిషేక్‌, ఐశ్వర్య.. గురు, ధూమ్‌ 2, రావన్‌, ఉమ్రావో జాన్‌ వంటి పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరు 2007లో పెళ్లి చేసుకోగా 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. ఇటీవల అభిషేక్‌- ఐశ్వర్య విడిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఐశ్వర్య ఒక్కరే పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతుండటంతో వీరిమధ్య దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. కానీ అదంతా వదంతి మాత్రమేనని కొట్టిపారేశాడు అభిషేక్‌. ఓ నెటిజన్‌ మై ఫేవరెట్‌ పీపుల్‌ అని ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో షేర్‌ చేయగా దీనిపై అభిషేక్‌ స్పందిస్తూ నాకు కూడా ఫేవరెట్‌ అని కామెంట్‌ చేశాడు. దీంతో వీరి విడాకుల రూమర్స్‌కు చెక్‌ పడినట్లైంది.

చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్‌, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే?

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)