Breaking News

‘అభిలాష’మూవీ ఎలా ఉందంటే..

Published on Sat, 06/03/2023 - 13:51

టైటిల్‌: అభిలాష
నటీనటులు: అమర్ దీప్, అశ్విని రెడ్డి, బాహుబలి ప్రభాకర్‌, సమ్మెట గాంధీ, కుమనన్ సేతురామన్ తదితరులు
నిర్మాణ సంస్థ: హరిహర ధీర మూవీ మేకర్స్
నిర్మాత: సీహెచ్‌ శిరీష
దర్శకత్వం: శివపస్రాద్ చలవాది
సంగీతం : ఏంఏం కుమార్‌
నేపథ్య సంగీతం: రోహి బాబు 
సినిమాటోగ్రఫీ: సౌమ్యశర్మ
ఎడిటర్‌: రవితేజ
విడుదల తేది: జూన్‌ 2, 2023

‘అభిలాష’కథేంటంటే..
వైదేహి(అశ్విని రెడ్డి) ఓ అనగారిన వర్గానికి చెందిన యువతి. ఉన్నత చదువులు చదివి, కలెక్టర్‌ కావాలనేది ఆమె కోరిక. కానీ ఆమె ఉన్న ఊర్లో అనగారిన వర్గానికి చెందిన వాళ్లు పెద్ద చదువులు చదువొద్దని కండీషన్‌ పెడతాడు గ్రామ పెద్ద. దీంతో ఊరి పెద్దకు తెలియకుండా వైజాగ్‌లో సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతుంది వైదేహి. ఈ క్రమంలో ఆమెకు శ్రీరామ్‌(అమర్‌దీప్‌) పరిచయం అవుతాడు. అతను ఉద్యోగం కోసం వైజాగ్‌ వచ్చి, సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్నానని అబద్దం చెప్పి వైదేహికి క్లోజ్‌ అవుతాడు. శ్రీరామ్‌ ఎందుకు వైదేహికి క్లోజ్‌ అయ్యాడు? సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్న వైదేహిని చంపేందుకు ప్రయత్నించేది ఎవరు? ఎందుకు? చివరకు వైదేహి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అభిలాష’ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
సరిగ్గా 40 ఏళ్ల క్రితం మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘అభిలాష’ చిత్రం ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. అదే పేరుతో ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు ఈ ‘అభిలాష’ చిత్రం అందుకోలేకపోయింది. కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం ఇచ్చింది. విద్య అనేది ఒక వర్గానికే కాదు, అందరికి ముఖ్యమనే మంచి మెసే​జ్‌ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో కాస్త విఫలం అయ్యాడు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే.. అంతా కొత్తవాళ్లు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు.

ఇక నటీనటుల ఫెర్పార్మెన్స్‌ విషయాలకొస్తే.. శ్రీరామ్‌గా అమర్‌ దీప్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో ఈజ్‌తో చేశాడు. వైదేహిగా అశ్విని రెడ్డి చక్కగా నటించింది. సమ్మెట్ట గాంధీ, బాహుబలి ప్రభాకర్‌, కుమనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తిరుపతి జావన అందించిన సాహిత్యం బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ శృతిమించింది. సినిమాటోగ్రాఫర్‌, ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)