Breaking News

పదేళ్ల తర్వాత అబ్బాస్‌ రీఎంట్రీ.. వీడియో చూశారా?

Published on Mon, 12/22/2025 - 12:01

ఇటీవల ఒక్క మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న కథానాయకులలో జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఒకరని చెప్పవచ్చు. ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న ఈయన ఇప్పటికే శత చిత్రాలకు చేరుకున్నారు. పరాశక్తి  జీవీ.ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న 100వ చిత్రం. అదేవిధంగా సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్న ఈయన హీరోగానూ నటిస్తున్న విషయం తెలిసిందే. డార్లింగ్, బ్యాచిలర్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించారు. 

హ్యాపీరాజ్‌మూవీ
అయితే ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నాయి. చివరగా ఈయన నటించిన బ్లాక్‌ మెయిల్‌ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. తాజాగా హ్యాపీరాజ్‌మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ శిష్యుడు ఇళంసెళియన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గౌరీప్రియ హీరోయిన్‌. ఈ చిత్రంలో ప్రేమదేశం హీరో అబ్బాస్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 

పదేళ్ల తర్వాత రీఎంట్రీ
గతంలో హీరోగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించిన ఈయన చాలా కాలం క్రితమే దుబాయిలో సెటిల్‌ అయ్యారు. తాజాగా హ్యాపీరాజ్‌ ద్వారా దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బియాండ్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని  యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్ర ప్రోమో వీడియోను శనివారం విడుదల చేశారు.  ఇందులో అబ్బాస్‌ ఐయామ్‌ బ్యాక్‌ అంటూ బరిలోకి దిగాడు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)