ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Wed, 12/10/2025 - 11:24

ఓటీటీల్లోకి ఈ వారం పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీతో పాటు 'త్రీ రోజెస్' అనే తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 2 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.

సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.. తమిళంలో హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ మూవీ 'ఆరోమలే'. కిషన్ హీరోగా నటించాడు. నవంబరు 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. హౌస్‌ఫుల్స్ కూడా బాగానే అయ్యాయి. నెల పూర్తయిందో లేదో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (డిసెంబరు 12) నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. బయట దేశాల్లో సింప్లీ సౌత్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

'ఆరోమలే' విషయానికొస్తే.. ప్రేమ అనేది సినిమాల్లో చూపించినట్లు ఉంటుందని నమ్మే కుర్రాడు అజిత్ (కిషన్). స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమిస్తాడు కానీ అపర్థాల వల్ల బ్రేకప్ అవుతుంది. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఓ మ్యాట్రిమోనీ ఏజెన్సీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ ఇతడి బాస్ అంజలి (శివాత్మిక)తో సమస్యలొస్తాయి. ఈమె.. ప్రేమ అనేది లాజిక్ అని నమ్మే టైపు. అలా ప్రేమ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్న వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా? అజిత్‌కి మూవీ టైపు ప్రేమ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ. ప్రేమ అనే ఎమోషన్స్‌ని చూపిస్తూనే కామెడీ కూడా బాగుందనే టాక్ అయితే వచ్చింది. ఓటీటీలోకి వచ్చాక తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)