Breaking News

పాకిస్తాన్‌లో 'దంగల్‌' ఎందుకు రిలీజ్‌ చేయలేదో చెప్పిన ఆమిర్‌ ఖాన్‌

Published on Sat, 06/14/2025 - 10:07

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌( Aamir Khan) నటించిన 'దంగల్‌' చిత్రం 2016లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మూవీని రిలీజ్‌ చేశారు. కానీ,  పాకిస్తాన్‌లో భారత సినిమాలకు పెద్ద మార్కెట్‌ ఉంది. అయితే, దంగల్‌ చిత్రాన్ని పాక్‌లో ఎందుకు విడిదల చేయలేదో తాజాగా ఆ చిత్ర నటుడు ఆమిర్‌ ఖాన్‌ వెళ్లడించారు. రెజ్లర్‌ మహవీర్‌ ఫోగట్‌ జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2,070 కోట్లు రాబట్టింది. నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

దంగల్ పాకిస్తాన్‌లో ఎందుకు విడుదల కాలేదో ఆమిర్‌ ఖాన్‌ ఇలా చెప్పారు. 'పాక్‌లో దంగల్ విడుదల కావాలంటే వారు రెండు షరతులు పెట్టారు. మన జాతీయ గీతం, జాతీయ జెండాను మూవీ నుంచి తొలగించాలని అక్కడి ‌ సెన్సార్‌ బోర్డు  కోరింది. నేను అందుకు అంగీకరించలేదు.  గీతా ఫోగట్ మ్యాచ్ గెలిచిన సన్నివేశంలో భారత జెండాతో పాటు  జాతీయ గీతం ఉంటుంది. వాటిని తొలగిస్తినే ఈ చిత్రానికి అనుమతి ఉంటుందని పాక్‌ సెన్సార్‌ చెప్పింది. దీంతో ఒక సెకనులోపు, మా సినిమా పాకిస్తాన్‌లో విడుదల కాదని నేను వారికి చెప్పాను. పాకిస్తాన్ విడుదలను రద్దు చేయడం వల్ల తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్మాతలు నాతో చెప్పారు. అయినప్పటికీ, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేనికీ మద్దతు ఇవ్వకూడదని  స్పష్టంగా ఆరోజే చెప్పాను.

ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం దాడికి 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాక్‌పై భారత్‌‌ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పాక్‌ నటీనటులను బ్యాన్‌ చేయాలని ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ కోరింది. దీంతో వారిని పూర్తిగా భారత్‌లో నిషేధించారు.  
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)