'కూలీ' సినిమాకు రెమ్యునరేషన్‌ తీసుకోలేదు: స్టార్‌ హీరో

Published on Sat, 08/16/2025 - 14:07

రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో భారీ తారాగణమే ఉంది. అయితే, సినిమా క్లైమాక్స్‌లో ఆమిర్‌ ఖాన్‌ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుమారు 10 నిమిషాలకు పైగా ఉన్న ఆ సీన్‌ కోసం ఆయన ఏకంగా రూ. 20 కోట్లు రెమ్యునరేషన్‌ తీసకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా  ఆమిర్‌ రియాక్ట్‌ అయ్యారు.

కూలీ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన  ఆమిర్‌ ఖాన్‌ తన రెమ్యునరేషన్‌ గురించి తాజాగా రియాక్ట్‌ అయ్యారు. ఈ చిత్రం కోసం తాను డబ్బు తీసుకోలేదని చెప్పాడు. కేవలం రజనీకాంత్‌ కోసం మాత్రమే ఇందులో నటించానని తెలిపాడు. ఆపై కూలీ చిత్ర యూనిట్‌ మీద ఉన్న ప్రేమ వల్ల జీరో రెమ్యునరేషన్‌తో తన రోల్‌ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు.  రజనీకాంత్‌ మీద ఉన్న ప్రేమ వల్ల కూలీ సినిమా కథ కూడా వినకుండా ఓకే చెప్పానని ఆమిర్‌ఖాన్‌ గుర్తుచేశాడు. తన కెరీర్‌లో చాలా సంవత్సరాల తర్వాత  మొదటిసారి స్క్రిప్ట్ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పానన్నాడు.

భారీ  యాక్షన్ థ్రిల్లర్ కూలీ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. రెండురోజుల్లో రూ. 230 కోట్ల గ్రాస్‌ దాటినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)