Breaking News

హీరో కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్..!

Published on Sun, 07/06/2025 - 21:29

కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్.. బ్యాడ్మింటన్‌ ‍ప్లేయర్ గుత్తా జ్వాలను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో పాప జన్మించింది. 2021లో  ఈ జంట పెళ్లి చేసుకోగా.. నాలుగేళ్ల తర్వాత వీరి బిడ్డ పుట్టింది. అయితే తాజాగా వీళ్ల ఇంటికి బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ విచ్చేశారు. అంతేకాకుండా ఈ జంట జన్మించిన చిన్నారికి పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు హీరో విష్ణు విశాల్.

ఈ సందర్భంగా తమ కుమార్తెకు పేరు పెట్టినందుకు అమిర్‌ ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మా మైరాని పరిచయం చేస్తున్నాను... మా బిడ్డకు పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చినందుకు అమిర్ ఖాన్ సార్‌కు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. కోలీవుడ్ హీరో విష్ణు విశాల్  ఎఫ్‌ఐఆర్‌, లాల్‌ సలామ్‌ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరోవైపు అమిర్ ఖాన్ సితారే జమీన్‌ పర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే గతంలో.. తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్‌.. విష్ణు విశాల్‌ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నట్టు కోలీవుడ్‌లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)