Breaking News

దాదాసాహెబ్‌... అంత ఈజీ కాదు: ఆమిర్‌ ఖాన్‌

Published on Sun, 06/29/2025 - 15:21

దివంగత ప్రముఖ దర్శక–నిర్మాత–స్క్రీన్‌ రైటర్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే (Dada Saheb Phalke) జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌ చేయనున్నారు. ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)తో ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వంలో ఈ దాదాసాహెబ్‌ బయోపిక్‌ రూపొందనుంది.  తాజాగా ఈ సినిమా గురించి ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ చేయడం అనేది పెద్ద చాలెంజ్‌. వాణిజ్యపరమైన అంశాలున్న సాధారణ సినిమా కాదు ఇది. ఆ రోజుల్లోనే ఎవరూ ఊహించలేని విధంగా అడ్వెంచర్‌ చేసిన వ్యక్తి కథ ఇది. 

అంత ఈజీ కాదు
ఆయన జీవితంలో ఎన్నో ఎగ్జైట్‌ చేసే అంశాలు, సంగతులు, సంఘటనలు ఉన్నాయి. అడ్వెంచర్‌ జర్నీలాంటి ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ చేయడాన్ని నేను, రాజు (దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణి కావొచ్చు) పెద్ద గౌరవంగా ఫీల్‌ అవుతున్నాం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన్‌ చేశాం’’ అని ఆమిర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం.

చదవండి: '21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)