Breaking News

గ్లిజరిన్‌ లేకుండా సహజంగా నటించాం: ఆకాంక్షా సింగ్‌

Published on Fri, 05/23/2025 - 01:13

‘‘తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా చేస్తున్న సమయంలో మా నాన్న గుర్తొచ్చారు. ఆయన్ని నేను చాలా మిస్‌ అయ్యాను. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడాల్సిన చిత్రమిది. తల్లిదండ్రులను ప్రేమించండి...  వారితో ఎక్కువ సమయాన్ని గడపండి’’ అని హీరోయిన్‌ ఆకాంక్షా సింగ్‌ తెలిపారు. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ ప్రభ దర్శకత్వంలో హీరో రూపేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆకాంక్షా సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘షష్టిపూర్తి’లో జానకి అనే గ్రామీణ అమ్మాయి పాత్ర చేశాను. అచ్చమైన తెలుగమ్మాయిలా లంగా ఓణిలో స్క్రీన్‌పై కనిపించడం నాకిదే తొలిసారి. ఇక ‘బెంచ్‌ లైఫ్‌’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారితో నటించాను. ఇప్పుడు ‘షష్టిపూర్తి’లో చేశాను. మేమిద్దరం ఎప్పుడు కలిసి నటించినా భావోద్వేగ సన్నివేశాల కోసం గ్లిజరిన్‌ వాడలేదు. సహజంగానే నటించేస్తాం. కథ, పాత్ర నచ్చితే వెబ్‌ సిరీస్‌లో అయినా నటిస్తాను. యాక్షన్‌ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో ఓ యాక్షన్‌ మూవీ చేస్తున్నాను. తమిళంలో ఒక సినిమా ఒప్పుకున్నాను’’ అని తెలిపారు.

Videos

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)