Breaking News

12 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో

Published on Sun, 09/17/2023 - 10:29

7/G బృందావన్ కాలనీ.. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. 20 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. నిర్మాత ఏఎం రత్నం తనయుడే రవికృష్ణ. 7/G బృందావన్ కాలనీ తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీగా విడుదలైంది. అక్కడ కూడా సెన్సేషన్‌ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నాడు రవికృష్ణ.

తర్వాత తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు, కానీ మళ్లీ అంతటి హిట్‌ అందుకోలేకపోయాడు. 2011లో చివరగా అరణ్య కాండం అనే తమిళ చిత్రంలో కనిపించాడు. తర్వాత వెండితెరకు దూరమయ్యాడు. ఇన్నాళ్లకు అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. తొలి సినిమాను డైరెక్ట్‌ చేసిన సెల్వ రాఘవన్‌ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయబోతున్నారు. 7/G బృందావన్ కాలనీ ఈ నెల 22న మరోసారి థియేటర్లలో విడుదల కానుంది.

ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడాడు. 'చాలారోజులుగా ఈ మూవీని రీ రిలీజ్‌ చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సెకండ్‌ పార్ట్‌ ప్లాన్‌ చేస్తున్నాం. దానికంటే ముందు ఈ సినిమాను మరోసారి మీరు చూసేయండి' అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పటికి, ఇప్పటికి రవికృష్ణలో చాలా మార్పు వచ్చింది. అసలు 7/G బృందావన్ కాలనీ హీరోలానే లేడు. బరువు పెరిగి గుర్తుపట్టరానంతగా మారిపోయాడు.

చదవండి: అజిత్‌తో సినిమాకు సిద్ధమైన జైలర్‌ నిర్మాతలు.. ఏకంగా అన్ని కోట్లు ఆఫర్‌!

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు