Breaking News

సంబరాలకు వీడ్కోలు

Published on Mon, 05/25/2026 - 00:03

కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సంబరాలు ముగిశాయి. ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన 79వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ముగిసింది. ఈ నెల 12న ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు ఈ నెల 23తో ముగిశాయి. ఈ ఏడాది కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డులకు సంబంధించిన ప్రధానపోటీ విభాగానికి జ్యూరీ ప్రెసిడెంట్‌గా సౌత్‌ కొరియన్‌ దర్శకుడు పార్క్‌ చాన్‌ ఉక్‌ వ్యవహరించారు. ‘ది ఎలక్ట్రికల్‌ కిస్‌’ చిత్రంతో కాన్స్‌ చలన చిత్రోత్సవాలు ప్రారంభమై, ‘ఫ్యోర్డ్‌’ చిత్రంతో ముగిశాయి.

క్రిస్టియన్‌కి రెండో పామ్‌ డి ఓర్‌’ పురస్కారం
కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అత్యున్నత పురస్కారంగా భావించే పామ్‌ డి ఓర్‌ అవార్డును ‘ఫ్యోర్డ్‌’ సినిమాకుగానూ రొమేనియన్‌ దర్శకుడు క్రిస్టియన్‌ ముంగియును వరించింది. ఈ చిత్రం మే 18న కాన్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది. కాగా క్రిస్టియన్‌ ముంగియుకు ఇది రెండో పామ్‌ డి ఓర్‌’ పురస్కారం కావడం విశేషం.

2007లో జరిగిన 60వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘4 మంత్స్, 3 వీక్స్‌ అండ్‌ 2 డేస్‌’ చిత్రానికి తొలిసారి పామ్‌ డి ఓర్‌’ పురస్కారాన్ని అందుకుని, ఈ అవార్డును స్వీకరించిన తొలి రొమేనియన్‌ దర్శకుడిగా నిలిచారాయన. ఇలా రెండుసార్లు పామ్‌ డి ఓర్‌’ పురస్కారాన్ని అందుకున్న పదిమంది దర్శకుల్లో ఒకరిగా నిలిచారు క్రిస్టియన్‌. ఆల్ఫ్‌ స్జోబెర్గ్, ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కొ΄్పోలా, బిల్లే ఆగస్ట్‌ వంటి దర్శకులు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

ఆండ్రీకి ‘గ్రాండ్‌ ప్రీ’ 
కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెండో ప్రతిష్టాత్మక పురస్కారంగా చెప్పుకునే ‘గ్రాండ్‌ ప్రీ’ అవార్డు రష్యన్‌ దర్శకుడు ఆండ్రీ జ్వా్యగింత్సేవ్‌ తెరకెక్కించిన ‘మినోటార్‌’ (2026) చిత్రానికి లభించింది. ఇక ఉత్తమ దర్శకుల అవార్డును ఈసారి ముగ్గురు అందుకోవడం విశేషం. స్పానిష్‌ ఫిల్మ్‌ ‘ది బ్లాక్‌ బాల్‌’ చిత్రానిగానూ దర్శక ద్వయం జేవియర్‌ కాల్వో, జేవియర్‌ అంబ్రోస్సి, జర్మనీ బయోగ్రాఫికల్‌ ఫిల్మ్‌ ‘ఫాదర్‌ ల్యాండ్‌’ చిత్రానికిగాను పావెల్‌ పావ్లికోవ్సీ్క ఉత్తమ దర్శకులుగా నిలిచారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల్లో ఈసారి ఇద్దరికి అవార్డులను ప్రకటించారు.

లూకాస్‌ ధోంట్‌ దర్శకత్వం వహించిన వార్‌ డ్రామా ‘కవార్డు’ చిత్రంలోని అద్భుతమైన నటనకుగాను బెల్జియం నటుడు ఇమ్మాన్యుయేల్‌ మచ్చియా, ఫ్రెంచ్‌ యాక్టర్‌ వాలెంటిన్‌ క్యాంపెయిన్‌ ఉత్తమ నటులుగా నిలిచారు. జపాన్‌ దర్శకుడు ర్యూసుకే హమగుచి తెరకెక్కించిన తొలి ఫ్రెంచ్‌ సినిమా ‘ఆల్‌ ఆఫ్‌ ఎ సడన్‌’లో ప్రతిభ చూపిన ఫ్రాన్స్‌ నటి వర్జినీ ఎఫిరా, జపాన్‌ నటి టావో ఒకామోటో ఉత్తమ నటీమణులుగా గెలిచారు. కాన్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న తొలి జపాన్‌ నటిగా టావో ఒకామోటో రికార్డు సృష్టించారు. అన్‌సర్టైన్‌ రిగార్డ్‌ విభాగంలో ఆస్ట్రియన్‌ దర్శకురాలు సాండ్రా వోల్నర్‌ తీసిన ‘ఎవ్రీ టైమ్‌’ చిత్రానికి అవార్డు లభించింది.

కాన్స్‌లో భారతీయం 
ఈ ఏడాది కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారత సినీ తారలు బాగానే సందడి చేశారు. ఈ చిత్రోత్సవాల్లో ముందుగా ఆలియా భట్‌ రెడ్‌ కార్పెట్‌పై నడిచారు. ఆ తర్వాత ఊర్వశీ రౌతేలా, కళ్యాణీ ప్రియదర్శన్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, అదితీరావు హైదరీ, డయానా పెంటీ, మౌనీ రాయ్‌ వంటి తారలు రెడ్‌ కార్పెట్‌పై నడిచారు. ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఐశ్వర్యా రాయ్‌ మరోసారి తనదైన స్టైల్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

తొలిరోజు నీలి రంగు డ్రెస్‌లో కనిపించిన ఐశ్వర్య ముగింపు వేడుకల్లో తెలుపు రంగు డిజైనర్‌ వేర్‌లో కనిపించారు. క్రిటిక్స్‌ జ్యూరీ అధ్యక్షురాలిగా పాయల్‌ కపాడియా బాధ్యతలు నిర్వర్తించారు. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ‘గ్లోబల్‌ సినిమా స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌’ వేదికగా అభివర్ణించారు దర్శక–నిర్మాత గునీత్‌ మోంగా. దివంగత దర్శకుడు జాన్‌ అబ్రహాం దర్శకత్వం వహించిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘అమ్మ అరియాన్‌’ రీస్టోర్డ్‌ 4కే వెర్షన్‌ను కాన్స్‌ క్లాసిక్స్‌ విభాగంలో ప్రదర్శించారు. ‘లాసినెఫ్‌’ విభాగంలో పంజాబీ షార్ట్‌ ఫిల్మ్‌ ‘షాడోస్‌ ఆఫ్‌ ది మూన్‌లెస్‌ నైట్స్‌’ అవార్డు కోసంపోటీ పడింది. ఈ ఏడాది ఏ భారతీయ సినిమాకూ అవార్డు రాలేదు.
 

Videos

నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్

నాదే బాధ్యత.! సలార్ 2పై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?

3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం..

బాబు మాటలు.. APలో అగ్గి రాజేస్తున్న మనువాద రాజకీయం

తాటి చెట్టులా పెరిగావ్.. బుర్ర లేదు.. మీ అన్న చావు వెనుక ఉన్నది నువ్వేనా?!

నోటికాడి కూడు లాక్కున్నావ్.. దీనికి అనుభవిస్తావ్..

సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలన్నీ ముంబై పైనే

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. హల్ చల్ చేసిన నాగ బాబు

బుమ్రాకు రామ్ చరణ్ క్షమాపణలు

Photos

+5

మృణాల్‌ని ఇంత అందంగా చూసుండరేమో! (ఫొటోలు)

+5

'పాటశాల' ఈవెంట్‌లో మంచు మనోజ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తమిళ స్టార్ హీరోలతో మహేశ్ క్రికెట్ ఆడితే? (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 24-31)

+5

'మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' షో విజేతలుగా వాసంతి- కల్యాణ్‌ (ఫోటోలు)

+5

కరుప్పు సక్సెస్‌: కేక్‌ కట్‌ చేసిన త్రిష (ఫోటోలు)

+5

చీరలో చందమామలా సమీరా(ఫోటోలు)

+5

రామ్‌చరణ్‌ 'పెద్ది కీ ఆవాజ్‌' ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి ఆఫ్రికా ట్రిప్‌లో హీరోయిన్ మెహ్రీన్ (ఫొటోలు)

+5

కమెడియన్ అవినాష్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)