Breaking News

అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష

Published on Thu, 06/01/2023 - 15:11

అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దట్‌ సెవంటీస్‌ షో నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. యువతులపై అత్యాచారానికి పాల్పడినందుకుగానూ అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డానీ మాస్టర్‌సన్‌ 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 2003 చివర్లో 23 ఏళ్ల మరో యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.

దీనిపై 2020 జూన్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించగా.. 3.3 మిలియన్‌ డాలర్లు చెల్లించి అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా మరోమారు విచారణ జరగ్గా డానీ మాస్టర్‌సన్‌ను నిందితుడిగా తేల్చిన న్యాయస్థానం 30 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అయితే 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాగా 2003 ఏడాది చివర్లో ఓ యువతిని హాలీవుడ్‌ హిల్స్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్న ఆరోపణలో మాత్రం ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది.

న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా ఆయన భార్య, నటి బిజు ఫిలిప్స్‌ మాత్రం కోర్టులోనే బోరుమని ఏడ్చేసింది. ఇకపోతే లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ 2017లో ద రాంచ్‌ అనే కామెడీ షో నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది

చదవండి: ఆలియా భట్‌ ఇంట విషాదం.. నువ్వే నా హీరో అంటూ పోస్ట్‌

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)