Breaking News

విషాదం.. ‘కాంతార’ చూస్తూ ‍కన్నుమూసిన ప్రేక్షకుడు!

Published on Wed, 10/26/2022 - 11:17

కాంతార..  కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు రిషబ్ శెట్టి. ముఖ్యంగా భూత కోలా సాంప్రదాయం గురించి కాంతార సినిమాలో రిషబ్ చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు.

(చదవండి: చిక్కుల్లో కాంతార టీమ్‌.. లీగల్‌ నోటీసులు)

తాజాగా  ఈసినిమా చూసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకకు చెందిన రాజశేఖర్‌(45) అనే వ్యక్తి థియేటర్‌లో ఈ సినిమా చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో థియేటర్‌ యాజమాన్య వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగా అతను మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కన్నడ చిత్రాన్ని తెలుగులో  గీత ఆర్ట్ సంస్థ బ్యానర్ మీద అల్లు అరవింద్ అక్టోబర్‌ 15న విడుదల చేశాడు. రిషబ్‌ శెట్టి టేకింగ్‌, యాక్టింగ్‌కి టాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 

Videos

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)