Breaking News

‘29’ మూవీ రివ్యూ : సాదా సీదా కథే.. చూస్తుంటే కన్నార్పనీయదు

Published on Sun, 06/14/2026 - 11:50

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. వాటిలో తమిళ చిత్రం ‘29’ ఒకటి. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. 

అప్పుడెప్పుడో ఓ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది... థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ అని అంటారు. తన ఐడెంటీటీ గురించి చెప్పే ప్రయత్నంలో చెప్పిన డైలాగ్‌ అది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఓ గుర్తింపు ఉంటుంది. నిజానికి కొంతమంది స్వతహాగా ఆ గుర్తింపు సంపాదించుకుంటారు. మరికొందరు సంపాదించే పోరాటంలో ఉంటారు. ఆ దరిమిలా తీసిన కథే ఈ ‘29’ సినిమా. తాను రాసుకున్న కథను తానే వెండితెర మీదకు తీసుకువచ్చిన రత్నకుమార్‌ నిజంగా అభినందనీయుడే. ఇదో సాదా సీదా కథ. కానీ చూసే ప్రేక్షకుడిని మాత్రం కన్నార్పనీయదు. అంతలా ఏముందో ఈ కథలో ఓసారి చూద్దాం. 

సత్య 29 ఏళ్ళ కాలేజ్‌ యువకుడు. ఏ లక్ష్యమూ లేక నిరంతరం తన గుర్తింపు కోసం ఆరాటపడే పోరాట వీరుడు. ఆ ప్రయత్నంలోనే సత్యకు కథానాయిక విజ్జి పరిచయమవుతుంది. సత్యలా కాదు విజ్జి... ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అవుతుంటుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అసలే తనకు గుర్తింపు లేదనే బాధలో ఉన్న సత్యకు ఉన్నట్టుండి బాయ్‌ ఫ్రెండ్‌ అనే గుర్తింపు వచ్చిన ఆనందం ఎంతో సేపు నిలవదు.

 ఓ దశలో విజ్జి తన ప్రేమ తన లక్ష్యానికి అడ్డుగా ఉందని భావించి సత్యను ఇక కలవొద్దని చెబుతుంది. అనుకోకుండా తన జీవితంలో అడుగుపెట్టిన విజ్జి తనే ఇప్పుడు కలవొద్దని చెప్పడంతో సత్య కుమిలిపోతాడు. మరి... సత్యను కలవొద్దన్న విజ్జి ఐఏఎస్‌ పాసవుతుందా? సత్యకు తనకు కావలసిన గుర్తింపుతోపాటు విజ్జి దక్కుతుందా? అన్న విషయం మాత్రం ‘29’ సినిమాలోనే చూడాలి. పేరుకు ఇది తమిళ మాతృక అయినా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమ్‌ అవుతోంది. ఓ మంచి ఫీల్‌ ఉన్న ఎమోషనల్‌ డ్రామా ఈ సినిమా. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌. 
– హరికృష్ణ ఇంటూరు 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)