Breaking News

నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా

Published on Tue, 04/29/2025 - 08:43

నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie).. 2025 ఏప్రిల్‌ 4న విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.

హారర్ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కిన '28 డిగ్రీస్ సెల్సియస్' చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా? అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ తాజాగా 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో(Amazon Prime Video) స్ట్రీమింగ్‌ అవుతుంది. కేవలం నెలరోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.

కథేంటంటే..?
కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)