Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
తారక్ దొరకడం నా అదృష్టం.. రాజీవ్ కనకాల ఎమోషనల్
Published on Tue, 09/29/2026 - 14:50
స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికీ ఇప్పటికీ అభిమానులు ఉంటారు. అందులో ఉన్న పాటలు అలాంటివి మరి. కీరవాణి స్వరపరిచిన.. ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి పాట కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ కాలేజ్ ఈవెంట్ అయిన మొదటిగా వేసే పాట ఇది. అయితే 'స్టూడెంట్ నెంబర్ వన్' విడుదలై నిన్నటితో 25ఏళ్లు పూర్తయింది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఇది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానానికి పునాది వేసిందనే చెప్పాలి. 2001, సెప్టెంబర్ 27న విడుదలైన చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడ వైరల్ అవుతోంది.
పాతికేళ్ల క్రితం..
‘ వెండితెరపైకి వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. నా వ్యక్తిగత జీవితంలో, సినీ కెరీర్‌లో ఒక మరుపురాని సువర్ణ అధ్యాయం. అంతకముందు ఎన్నో సినిమాలు చేసినా ఈ సినిమా చేసిన తర్వాతే నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాతే నేను నటనను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకుని చిత్ర పరిశ్రమలో రాణించగలిగాను.
ఇందుకు రాజమౌళి, కీరవాణికి చాలా థ్యాంక్స్. ఇందులో నేను పోషించిన ‘సత్య’ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పటికీ ఏ వేదికపైకి వెళ్లినా ప్రేక్షకులు నన్ను ఆ పాత్ర పేరుతో గుర్తుచేసుకుని ఆప్యాయంగా పలకరిస్తుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:సినిమా ఆలస్యం.. హైదరాబాద్ పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు జరిమానా!
25 Years of Student No.1 ❤️🎬
25 ఏళ్ల క్రితం వచ్చిన Student No.1… ఒక సినిమా మాత్రమే కాదు, నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం.
ఈ సినిమా తర్వాతే నేను పూర్తిగా సినిమాల్లోకి వచ్చాను. ‘సత్య’ అనే పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ఆ పాత్ర గురించి గుర్తు… pic.twitter.com/cdlynlflls— Raajeev kanakala (@RajeevCo) September 29, 2026
Tags : 1