Breaking News

ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Tue, 05/07/2024 - 12:53

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి సినిమా ఆర్య. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం..ఊహించని విజయం సాధించింది. అటు సుకుమార్‌, ఇటు బన్నీ ఇద్దరి సీనీ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి(మే 7) సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌ ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్‌ కూడా ఆర్య షూటింగ్‌ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. 

‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్‌ మెమొరీస్‌’ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా షేర్‌ చేసుకున్నాడు.

20 ఏళ్ల సెలబ్రేషన్స్‌
ఆర్య సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్‌ రీ యూనియన్‌ ప్లాన్‌ చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో జరగనున్న ఈ వేడుకకి అల్లు అర్జున్‌, సుకుమార్‌, దిల్‌ రాజుతో పాటు ఆర్య టీమ్‌ అంతా హాజరుకానుంది. ప్రస్తుతం బన్నీ.. పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బన్నీ- సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. రష్మిక మందన్నా హీరోయిన్‌. ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్ట్‌ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)