Breaking News

లతా మంగేష్కర్ జయంతి.. స్పెషల్ టీజర్‌తో నివాళి!

Published on Sun, 09/28/2025 - 17:22

బాలీవుడ్ హీరో ఫర్హాన్‌ అక్తర్‌ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్‌ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్‌ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పటి యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్‌ అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమె నివాళిగా ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. 1962 భారత-చైనా యుద్ధంలో అమరవీరులను గౌరవించటానికి లతా మంగేష్కర్‌ 1963లో మొదటిసారి 'ఏ మేరే వతన్ కే లోగోన్' అనే సాంగ్‌ను ఆలపించారు. ఈ పాట చాలా కాలం పాటు ‍అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.

కాగా.. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్‌ సోల్జర్‌గా కనిపించనున్నారు.  తాజాగా విడుదలైన టీజర్‌ చూస్తే యుద్ధ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌లోని విజువల్స్, డైలాగ్స్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్‌ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో  రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, అమిత్ చంద్రా నిర్మించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)